కృష్ణాజిల్లా మోపిదేవి ఈ నెల 11వ తేదీ నుండి శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి దర్శనం. - ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 11 తారీఖు నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి జి వి డి ఎన్ లీలా కుమార్ శనివారం తెలిపారు. ఆయన మోపిదేవి లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 8, 9, 10 తేదీల్లో దేవస్థానం సిబ్బందితో ప్రయోగాత్మకంగా ట్రైల్ రన్ ప్రారంభించ బడును. భక్తులకు ఎలాంటి దర్శన సౌకర్యం లేదు. భక్తులు 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకూ దర్శన సమయం స్లాట్ బుక్ చేసుకొనవలెను దర్శన సమయం స్లాట్ లో బుక్ చేసుకోని భక్తులకు ఎట్టి పరిస్థితులలో దర్శనమునకు అనుమతించబడదు. దర్శన సమయం స్లాట్ బుక్ చేసుకొనుటకు 15వ తేదీ వరకు అవకాశం కలదు.65 ఏళ్ల వయసు పైబడిన వారు10 సంవత్సరముల లోపు పిల్లలకు దర్శనం అనుమతి లేదు. ప్రతి భక్తుడు మాస్కు తప్పనిసరిగా పెట్టుకొనవలెను. మాస్కు ధరించని భక్తులకు అనుమతి లేదు. దర్శనం నకు వచ్చు భక్తులు ఆధార్ కార్డు గానీ ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చిన ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకు రావలెను. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం నకు అనుమతించబడు నని ఆయన తెలిపారు. కంటెంట్మెంట్ జోన్ ల నుండి వచ్చే భక్తులకు దర్శనం నకు అనుమతి లేదు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పూర్తి మార్గదర్శకము లు 9వ తేదీ పత్రిక , మీడియా ముఖంగా తెలియజేయు బడు నని ఆయన తెలిపారు.