*ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్* పేదల స్థలాలు బలవంతంగా లాక్కొని తిరిగి పేదలకు అమ్మడమే ''జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం''.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మీ కాళ్లు మొక్కుతాం సార్ అని వేడుకున్నా వైకాపా ప్రభుత్వం కనికరించలేదు. దీనిపై కోర్టు ఇచ్చిన స్టే ని సైతం లెక్కచేయకుండా 1999 లో టిడిపి ప్రభుత్వం 50 ఎకరాల్లో 964 మంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమాలు అన్నీ,ఇన్నీ కావు.భూముల కొనుగోలు పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు. అవే స్థలాలు పేదలకు పంపిణీ అంటూ పేదల రక్తాన్ని పీలుస్తున్నారు.


Comments