జర్నలిస్టుల ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం.రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలి.సీఎం వైఎస్ జగన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.కళ్యాణ్ దుర్గం జర్నలిస్టుల సభ.మచ్చా రామలింగా రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్.రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని మచ్చా రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు .కళ్యాణదుర్గం (ప్రజాఅమరావతి):జూన్,25; పట్టణం లోని వివేకానంద కాలేజీలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జర్నలిస్టుల సమావేశానికి మచ్చా రామలింగా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జర్నలిస్టుల సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించాలని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపేందుకు కృషి చేయాలని మచ్చా రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు .కళ్యాణదుర్గం నియోజకవర్గ సమావేశానికి చంద్ర అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమంలో ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ వెంకటేశ్వర్లు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు .సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగా రెడ్డి ని ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ ను కళ్యాణదుర్గం నియోజకవర్గం జర్నలిస్టు ఘనంగా సన్మానించారు . కళ్యాణదుర్గం జర్నలిస్ట్ డెవలప్ మెంట్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షుడిగా తలారి చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .కళ్యాణదుర్గం డెవలప్ మెంట్ సొసైటీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మస్తాన్ ఖాన్ ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మండలం అధ్యక్షునిగా మల్లికార్జున, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షునిగా పురుషోత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కళ్యాణదుర్గం నియోజకవర్గ సదస్సుకు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆది ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి శాకీర్ తదితరులు పాల్గొన్నారు


Comments