*వసంత చివరి అస్త్రం......* *ఇళ్ల స్థలాల వ్యవహారంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్న ఎమ్మెల్యే......* *సచివాలయాలు వారీగా పర్యటించి అర్హులు, అనర్హులను గుర్తించే ప్రయత్నం........* *నేడు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించనున్న ఎమ్మెల్యే వసంత.........* *ఇబ్రహీంపట్నం (ప్రజాఅమరావతి);, కొండపల్లి ప్రాంతాల్లో అత్యంత వివాదాస్పదమైన ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులను తొలగించి అనర్హులకు ఇళ్ల స్థలాలు కట్ట బెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పారదర్సకతకు మరో చివరి అస్త్రం ప్రయోగించనున్నారు.. అందులో భాగంగా రెండు రోజులపాటు కొండపల్లి, ఇబ్రహీంపట్నం లోని పది గ్రామ సచివాలయాలు పర్యటించి అర్హులను, అనర్హులను గుర్తించనున్నారు..... ఇదే విషయం పై ఈరోజు ఇబ్రహీంపట్నంలో విలేకరుల సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.. అర్హత ఉండి స్థలం పొందలేని లబ్దిదారులకు, నిరుపేద కుటుంబాలకు వసంత మార్క్ న్యాయం ఎంత మేర జరుగుతుందో వేచి చూడాలి....*


Comments