నవంబరు 12,తాడేపల్లి-వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం *వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి శ్రీ కొలుసు పార్థసారథి పాయింట్స్..* *- నారా- హమారా మీటింగ్ లో.. ప్లకార్డులు ప్రదర్శిస్తే నంద్యాల యువకుల్ని జైల్లో పెట్టించింది మరిచిపోయారా బాబూ..?* *- న్యాయం కోసం ఆందోళన చేస్తే.. గుంటూరులో ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టింది మీరు కాదా.. ?* *- నంద్యాల ఘటనలో బెయిల్ ఇప్పించిన టీడీపీ నేతను రాజీనామా చేయిస్తే.. డ్రామాలన్నీ నిజాలైపోవు చంద్రబాబూ..!* *- చంద్రబాబు నాయుడు పీడ ఇంకా ఈ రాష్ట్రాన్ని వదలలేదు అని ప్రజలు భావిస్తున్నారు* *- చంద్రబాబు హయాంలో జరిగిన రావణ కాష్ట్రాలను ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదు* *- నంద్యాల ఘటనను పట్టుకుని చంద్రబాబు చేస్తున్న శవ రాజకీయమే అభ్యంతరకరం* *- చంద్రబాబు శవరాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలి* *- తప్పు చేసిన వాడు ఎవడైనా సరే.. శిక్షించాల్సిందే అని తెగేసి చెప్పిన సీఎం జగన్ గారు* *- జగన్ గారి పాలనలో ముస్లింలు సంతోషంగా ఉన్నందుకు బాధపడుతున్నారా బాబూ.. ?* *- ముస్లింలలో అభద్రతాభావం కలిగించటానికి ప్రయత్నిస్తున్నారా.. లేక సామాజిక బాధ్యతతో ప్రవర్తిస్తున్నారా బాబూ.. ?* *- ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే, ఒక్కరినైనా ఎందుకు మీ 5 ఏళ్ళ పాలనలో మంత్రిగా చేయలేదు..?** *శ్రీ పార్థసారథి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..* 1. చంద్రబాబు నాయుడు పీడ ఈ రాష్ట్రాన్ని ఇంకా వదలలేదు అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న కుల, మత, శవ రాజకీయాలు, జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అడుగడుగునా అడ్డుపడుతున్న తీరును గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. హైదరాబాద్ లో కూర్చుని, జూమ్ మీటింగ్ లు, ట్వీట్లు పెడుతూ.. రాజకీయంగా ఇంకా బతికే ఉన్నామని చెప్పుకోవటానికి చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. 2. 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అసమర్థ పాలన, రాక్షస పాలన అంటూ మాట్లాడుతున్నాడు. రాక్షస పాలన అంటే, అసమర్థ పాలన అంటే గత 5 ఏళ్ళు మీ హయాంలో జరిగిందే అన్న సత్యాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. మీ హయాంలో రాష్ట్రంలో మహిళలపైన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపైన చోటుచేసుకున్న రావణ కాష్టాలను ఈ దీపావళికి కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొట్టమొదట నెల నుంచే ప్రజలపైనా, అధికారులపైనా దాడులు జరిగాయి. అమరావతిలో ఒక వీఆర్వోని టీడీపీ నేతలు బట్టలు విప్పి కొట్టారు. పెందుర్తిలో ఒక దళిత మహిళను వివస్త్రను చేసి మీ పార్టీకి చెందిన వారే కొట్టడం జరిగింది. అలానే ఒక ఐపీఎస్ అధికారిని మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దాడి చేస్తే... మీరు కూర్చోబెట్టి రాజీ చేశారే.. దానిని రాక్షస పాలన అంటారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమార్వోను మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని కొట్టారో దాన్ని రాక్షస పాలన అంటారు. చంద్రబాబు పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి దాడులకు పాల్పడినట్టు, నేరాలు, ఘోరాలను ప్రోత్సహించినట్టుగా.. ఇప్పుడు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అలా చేయడం లేదు. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు అడుగుజాడల్లో.. ప్రజా సేవా పరమావధిగా పని చేస్తున్నారు. సంక్షేమ పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. అదే మీ హయాంలో ఎమ్మెల్యేలను అవినీతిలో, అరాచకాల్లో భాగస్వాములను చేశారు. 3. అసమర్థ పాలన అంటే.. ఊరూరా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రత్యర్థి పార్టీల వారిని ఎలా వేధించాలి, వాళ్ళ మీద ఎలా దొంగ కేసులు పెట్టాలి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలా కోతలు పెట్టాలి.. ఇసుక నుంచి మట్టి, మద్యం, నీరు-చెట్టు పేరుతో చెరువులను ఎలా ఖాళీ చేయాలి.. ఇలా దోచుకోవడానికి మీరు స్కీములు పెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే పథకాలు అమలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వందలకొద్దీ వాగ్దానాలు చేసి, ఎగ్గొట్టిన మీది అసమర్థ పాలన అని అంటారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనను చూసి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రంలోని పెద్దలు కూడా శెభాష్ అంటున్నారు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే.. శిక్షించాల్సిందే అని స్పష్టమైన సంకేతాలు ఇస్తూ.. పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారిది రాక్షస పరిపాలన కాదు. 4. నంద్యాల ఘటన చాలా బాధాకరం, ఆ ఘటన పట్ల అందరం బాధపడ్డాం. ఆ ఘటనను పట్టుకుని చంద్రబాబు చేస్తున్న శవ రాజకీయమే అభ్యంతరకరం. ప్రభుత్వమే అధికారులపై చర్యలు తీసుకుంది. కేసు పెట్టి జైల్లో పెట్టింది. వారిని కాపాడాలని ఎక్కడా చూడలేదు. అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారణం ఎవరు..? సీఐ, హెడ్ కానిస్టేబుల్ అన్నది మరణ వాంగ్మూలం ప్రకారం అందరికీ తెలుసు. మరి సీఐని ఎందుకు మీరు సమర్థిస్తున్నారు? ప్రభుత్వమే బెయిల్ రద్దు కోసం పిటీషన్ వేస్తే.. అది తెలిసి కూడా ఇంకా రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడటమా..? ప్రభుత్వం పోలీసులను అరెస్టు చేస్తే.. మీ పార్టీకి చెందిన నాయకుడి చేత బెయిల్ ఇప్పించి, తర్వాత అతన్ని రాజీనామా చేయిస్తే.. పచ్చరంగు మారుతుందా..? మీ డ్రామాలన్నీ నిజాలైపోతాయా..? 5. చంద్రబాబు 5 ఏళ్ళ పాలనలో ఎప్పుడూ ముస్లింల సంక్షేమ కోసం పాటుపడింది లేదు. ఈరోజు లేనిప్రేమను ముస్లిం, మైనార్టీల మీద ఒలకబోస్తున్నాడు. అధికారంలో లేనప్పుడేమో, టీడీపీ పుట్టిందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల కోసం అని ప్రచారం చేసుకుంటాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సర్వ నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాడు. ఇదీ చంద్రబాబు రెండు కళ్ళు, రెండు నాల్కల ధోరణి. 6. ముస్లింలపై మొసలి కన్నీరు తెగ కారుస్తున్న చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు గుంటూరులో నిర్వహించిన నారా- హమారా మీటింగ్ లో యాధృచ్ఛికంగా నంద్యాలకు చెందిన ముస్లిం యువకులే, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్ల కార్డులు పట్టుకుంటే.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ సమక్షంలోనే, అదే పోలీసులు వాళ్లను ఏవిధంగా హింసించారో ముస్లింలు ఇంకా మరిచిపోలేదు. అలానే, ముస్లిం బాలికకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తే ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టింది మీరు కాదా.. ? చంద్రబాబు చెప్పే మాటల్లోనే నీతి.. చేసేదంతా అవినీతి, అరాచకం, అన్యాయం. 7. మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళలో నాలుగున్నరేళ్ళు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించలేదు..? పెట్టుబడిదారులైన నారాయణను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. అలానే మీ చేతగాని, అసమర్థ కొడుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. కనీసం ముస్లింలకు ఎమ్మెల్సీ అయినా ఇచ్చారా..? 8. వైయస్ గారి కుటుంబానికి, ముస్లింలంటే ఎంతో ప్రేమ ఉంది. ముస్లింలను గుండెల్లో పెట్టుకున్న కుటుంబం అది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ముస్లిం సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలూ అమలు చేస్తున్నారు. ఆరోజు ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది వైయస్ఆర్ గారు కాదా.. ? ఆరోజు కూడా వైయస్ గారు ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంది చంద్రబాబు కాదా..? 9. జగన్ గారికి ముస్లిం, మైనార్టీలపై ప్రేమ ఉంది కాబట్టే, కేవలం 17 నెలల కాలంలో రూ. 3,428 కోట్లు ముస్లింలకు సంక్షేమ పథకాల ద్వారా అందించారు. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు గారు 5 ఏళ్ల పాలనలో కేవలం రూ. 2,661 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. జగన్ గారి పాలనలో ముస్లింలు సంతోషంగా ఉన్నందుకు బాబు గారూ.. మీరు బాధపడుతున్నారా.. ? రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలలో అభద్రతాభావం కలిగించటానికి మీరు ప్రయత్నిస్తున్నారా.. లేక సామాజిక బాధ్యతతో ప్రవర్తిస్తున్నారా..? 10. జగన్ గారి పాలనలో ఎక్కడా వివక్ష లేదు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఎక్కడైనా ఒకటి, అర తప్పులు జరగవచ్చు, ఆ తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరును చూడాలి. జగన్ మోహన్ రెడ్డిగారు పరిపాలనలో తీసుకుంటున్న విధానాల మీద మాట్లాడటానికి చంద్రబాబుకు నోరు రావడం లేదు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల.. ఈరోజు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిందన్నది జగమెరిగిన సత్యం 11. జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక, ఒకవైపు పథకాలను ఎలా అడ్డుకోవాలా.. అని కుట్రలు పన్నడం, మరోవైపు కుల, మత, రాజకీయాలు చేయటానికే చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ప్రజలకు ఎప్పుడు అవకాశం వచ్చినా, చంద్రబాబుకు మరోసారి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. *పార్థసారథి సూటిగా ప్రశ్నిస్తూ..* 1. అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారణం ఎవరు..? సీఐ, హెడ్ కానిస్టేబుల్ అన్నది మరణ వాంగ్మూలం ప్రకారం అందరికీ తెలుసు. మరి సీఐని ఎందుకు సమర్థిస్తున్నారు? 2. మీ పార్టీ నుంచి రాజీనామా చేయించినంత మాత్రాన అతను మీ మనిషి కాకుండా పోతాడా..? 3. సుజనా చౌదరినే మీ మనిషిగా బీజేపీలో చేర్చిన మీరు, ఒక లాయర్ ను రాజీనామా చేయినంచినంత మాత్రాన మీ పచ్చ రంగు పోతుందా..? 4. సీఐ మీద 306 సెక్షన్ కిింద కేసు ఉన్న విషయం మీకు తెలియదా.. ? - అయినా మీ లాయర్ ని ఎందుకు పంపారు..? 5. ముస్లింలకు సంబంధించి మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒక్కరినైనా ఎందుకు మీ 5 ఏళ్ళ పాలనలో మంత్రిగా చేయకుండా ఉన్నారు. 6. ముస్లింలలో ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం న్యాయం చేయబట్టే కదా.. జగన్ మోహన్ రెడ్డిగారి పాలనలో ఏకంగా రూ. 3,428 కోట్లు 17 నెలల్లోనే వారికి అందింది. మరి మీ 5 ఏళ్ళ పాలనలో 2661 కోట్లు మాత్రమే వారికి ఇచ్చారంటే దీని అర్థం ఏమిటి? 7. ముస్లింలు సంతోషంగా ఉన్నందుకు బాబు గారూ.. మీరు బాధపడుతున్నారా.. ? 8. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలలో అభద్రతాభావం కలిగించటానికి మీరు ప్రయత్నిస్తున్నారా.. లేక సామాజిక బాధ్యతతో ప్రవర్తిస్తున్నారా..?

.