నవంబర్ 13, అమరావతి (prajaamaravati) ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలి: సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* *ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి..* *-ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారి దీపావళి శుభాకాంక్షలు* దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

.