విశాఖ మన్యంలో గుల్లు రాగి పంట విశాఖ ఏజెన్సీలో గిరిజనులు రాగి పంట ఎక్కువగా పండిస్తుంటారు ఈ రాగులతో గిరిజనులు రాగి జావా రాగి తోపా రాగి రోట్లు ఆహారంగా బుజించి బలం పొందుతారు, అయితే విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం చిన్నగెడ్డ గ్రామంలో మంగ్లీ అనే రైతు భూమిని చదును చేసి రాగి పంట వేయాలని ఆలోచిస్తున్నాడు మంగ్లీ సోదరుడు భూమి చదును చేసి రాగి విత్తనాలు వెదజల్లాడు మంగ్లీ అయితే వ్యవసాయ పరిశోధన స్థానం మరియు రైతు సాధికార సంస్థ ఆలోచనల మేరకు పంట వేయాలని చూస్తున్నాడు ఈ సమయములో హుకుంపేట మండలం రంగసీల పంచాయతీలో ఒక గిరిజన మహిళ జమున సేంద్రీయ పద్ధతిలో రాగి విత్తనాలు వేసి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ దిగుబడి లాభం పొందినట్లు అమ్మోజి ద్వారా తెలుసుకున్నాడు ఇప్పుడు తన సోదరుడుల కాక ఇతడు రైతు సాధికార సంస్థ చెప్పినట్లుగా గుళ్ళు రాగి పంట వేశాడు మంగ్లీ పంట కోతకు వచ్చింది తన సోదరుడు పంట నేలమట్టమైంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి నాలుగు జిల్లాల్లో విశాఖ ,తూర్పుగోదావరి, విజయనగరం ,మరియు శ్రీకాకుళం ,జిల్లాల్లో 50 ఎకరాల్లో 120 మంది రైతులతో మొదలుపెట్టారు ఇప్పుడు 4,500 మంది రైతుల వరకు గుళ్ళురాగి, జమున, మోడల్ డ్రైవ్, పంటలు వేసి రైతులు లబ్ధి పొందుతున్నారు వెదజల్లి పండించే పంట కంట నారు పోసి పండించే పంట ఎక్కువ దిగుబడి ఉంటుందని రైతు ఆనంద పడుతున్నాడు ఈ కార్యక్రమానికి అనేక మంది రైతులుపాల్గొన్నారు , మంగ్లీ అనే రైతు అభినందించి సన్మానించారు పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వర చేతుల మీదుగా పంట కోత కోశారు ఈ కార్యక్రమంలో లో వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ శేఖర్ డాక్టర్ మోహన్, ADనవీన్ ,జ్ఞానమని , మరియు సంజీవిని సంస్థ కార్యదర్శి దేవుడు మరికొన్ని సంస్థలు పాల్గొన్నాయి

.