సంక్షేమం, సేవలకు నిలయాలు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలు సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ సేవలకు నిలయాలని, అందులో పని చేసే సిబ్బంది వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, ప్రజలకు సత్వరంగా అందజేసి, ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చాలని గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు పేర్కొన్నారు... గుంటూరు జిల్లా తాడేపల్లి లోని కెఎల్ విద్యా సంస్థల ఆడిటోరియంలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు సందేశం ఇచ్చారు...... తమ సందేశంలో, గతంలో పింఛన్లు రావాలంటే, పొందూతున్నవారు మరణిస్తేనే మంజూరు కావడం కలెక్టర్ గా తాను కళ్ళారా చూసానని, ఇప్పుడా దురవస్థ లేకుండా, మన ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అర్హులైన వారందరికీ పది రోజులలోపే పింఛన్లు మంజూరు చేసే వ్యవస్థను మన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా అమలు చేయడం చారిత్రాత్మకమన్నారు... ఒకప్పుడు అర్జీలు ఇవ్వాలంటే సుదూర మండల కేంద్రాలకు పౌరులు వెళ్ళే వారని, ఇప్పుడా పరిస్థితి లేకుండా, ముంగిటలోనే ప్రజలు అర్జీలు ఇవ్వడానికి గ్రామ సచివాలయాలున్నాయని వివరించారు..... కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ చేపట్టుతున్నారని, ఈ తనిఖీల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల లోటుపాట్లు, పొరపాట్లు సరిదిద్దబడడానికి ఆస్కారం వున్నదన్నారు... ప్రభుత్వం ప్రవేశపెట్టిన 540 రకాల సేవల జాబితాను ప్రదర్శించాలి. ఆ పథకాల గురించి ప్రజలకు వివరించడానికి అవగాహన పెంచుకోవాలన్నారు.... 540 రకాల సేవలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నప్పటికీ ప్రజలు కేవలం నలభై రకాల సేవలు మాత్రమే పొందుతున్నారని, ఆర్టీసి నుంచి ఆర్టీవో దాకా ఇంకా 500 రకాల సేవలపై జనసామాన్యానికి జాగరూకత కల్గించాలన్నారు... ఈ శిక్షణా కార్యక్రమంలో బోధించిన వివిధ రకాల సేవలు, ప్రవర్తనా నియమావళి, సీసీఏ నియమావళి పై శిక్షణార్థులకు పరీక్ష నిర్వహించాలన్నారు. ఆ పరీక్ష లో కనీస మార్కులు సాధించలేని వారికి మళ్ళీ శిక్షణ ఇవ్వాలని, అప్పటికీ వారు మంచి ఫలితాలు సాధించలేకపోతే వారి ప్రొబేషన్ కాలాన్ని పొడిగించడం జరుగుతుందని, ఈ విషయమై సుప్రీం కోర్టు వారు కూడా తీర్పు ఇచ్చారని ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ గారు గారు విశదీకరించారు..... తాజాగా 138 వెనుకబడిన కులాల సర్వేను వాలంటీర్లు ద్వారా చేయించడం జరుగతున్నదని, ఈ బీసీ ల సర్వే పకడ్బందీగా జరుగునట్లుగా చూస్కోవాలని వివరించారు.... ప్రతి ఉద్యోగి సమాచార సాంకేతికపై సాధికారత కలిగి వుండాలన్నారు.... సహచర సిబ్బందిలో కూడా కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించడానికై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వాలన్నారు.. 6 అంచెల తనిఖీ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు చేకూర్చాలని, ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్లుగా చివరి అర్హుడైన వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలను పొందడానికి దోహదపడాలన్నారు... ఈ శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కమీషనరు రామనాథరెడ్డి గారు, జాయింట్ డైరెక్టర్ మొగిలిచెండు సురేశ్ గారు, డీపీవో శ్రీదేవి గారు, శిక్షణా విభాగం సిబ్బంది బాజీద్, నాగేశ్వరరావు, రమణ, కేశవరావు పాల్గొన్నారు