శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ(prajaamaravati): ఈరొజు అనగా ది.13-11-2020, శుక్రవారము రొజున ధనత్రయోదశి సంధర్భముగా యాగశాల నందు దేవస్థానము వారు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆద్వర్యములొ శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు మరియు ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగం భొట్ల దుర్గా ప్రసాద్ దంపతుల వారిచే శ్రీ మహాలక్శ్మీ యాగము శాస్త్రొక్తముగా నిర్వహించడము జరిగినది. రేపు అనగా ది.14-11-2020 న దీపావళి సంధర్భముగా శ్రీ అమ్మవారి ప్రధానాలయము నందు సా.5 గ.లకు ధనలక్శ్మి పూజ(దేవస్థానం తరపున మాత్రమే) నిర్వహించబడును. మరియు సాయంత్రం 06 గం.లకు శ్రీ అమ్మవారికి పంచహారతులు సేవ నిర్వహించిన అనంతరం సా.07.గం.లకు ప్రధానాలయ మరియు ఉపాలయములు కవాటబంధనము( తలుపులు మూసివేయబడు) చేయబడునని, కావున భక్తులకు దర్శనము నిలుపుదల చేయబడునని, మరలా తిరిగి ది.15-11-2020 న యధావిధిగా శ్రీ అమ్మవారి దర్శనము కల్పించబడును. శ్రీ అమ్మవారి సేవలో... కార్యనిర్వహణాధికారి.