ఏలూరు (prajaamaravati), 13. ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రధానమంత్రి అవార్డు కింద స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ ) ప్రజల భాగస్వామ్యం కేటగిరి లో పశ్చిమ గోదావరి జిల్లా అవార్డుకు ఎంపిక అయిందని జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ) కింద "ప్రజల భాగస్వామ్యం" కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ నుండి తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు ఎంపిక కాబడ్డాయని ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి సమాచారం అందిందని ఆయన తెలిపారు . జిల్లాలో మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ,ప్రజల ను భాగస్వామ్యం చేయడం, బహిరంగ మల విసర్జన వల్ల కలిగే అనర్ధాలు పై ప్రజలను చైతన్య పరచటం,ప్రతీ కుటుంబం తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలని ప్రజల్లో అవగాహన తీసుకురావడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయడం ద్వారా ఈ అవార్డు జిల్లాకు రావటం జరిగిందని ఆయన తెలిపారు. ఈ అవార్డు నవంబర్ 19వ తేదీన వరల్డ్ టాయిలెట్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ అవార్డును ప్రధానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు

.