*రెగ్యులరైజషన్ అయ్యేంత వరకు మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు ఇవ్వబడవు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి. తాడేపల్లి(prajaamaravati): *దరఖాస్తు చేసుకున్నాక అనుమతులు ఇవ్వక పోవడం అంటూ ఏమి లేదు ఎవరూ నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడం లేదు* *ఇప్పటవరకూ కట్టిన నిర్మాణాలను కుల్చడంలేదు, హెచ్చరించి, నిబంధనలను ఉల్లంఘించిన వాటిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నాం.* *గడిచిన కొంతకాలంగా నిర్మాణాల విషయంలో ప్రజలకు స్పష్టత ఇస్తున్నాం* *2014 సీఆర్డీఏ సెక్షన్ 115(1) ప్రకారమే నిర్మాణాలకు అనుమతులు లేవు* *మేము చట్టాన్ని అతిక్రమించడంలేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం* *చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకోవడం లేదు ప్రస్తుతం ఉన్న అక్రమ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు* *అనుమతులతో పనిలేకుండా అర్దరాత్రి సమయం లేదా సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతన్నారు* *మేము ప్రజా సేవ కోసమే ఉన్నాము అనుమతులు లేని నిర్మాణాలను తొలగిస్తాం అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం....* *స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న చెరువును కూడా ఆక్రమించి 150 నివాసాలు నిర్మించారు.....* *ఒక వ్యక్తి కోసం కాదు వ్యవస్థ కోసం మేము పని చేస్తున్నాము...* *ఇప్పటి వరకు సుమారు 7 వేలకు పైగా ఇళ్లను రెగ్యులరైజషన్ చెయ్యాలని ఉన్నత అధికారులను కోరడం జరిగింది.* *నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపల్ సిబ్బందిని సంప్రదించండి* *దళారులను నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దు*