గ్రామ పంచాయతీ ఎన్నికలు- 2021 మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న జరుగనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ 12 జిల్లాల ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్ రబ్బర్ స్టాంప్ లు, ఇండెలిబుల్ఇంకు తదితర ఎన్నికల సామాగ్రి ఆయా పోలింగ్ బూత్ లకు సోమవారం అంటే 8-2-2021 మధ్యాహ్నం కల్లా చేరాలని, ఆర్.ఓలు, పిఒలు అంతా పోలింగ్ కు సిద్ధంగా ఉండాలని, ఆయా రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని అంటూ పోలింగ్ సిబ్బంది ముందు రోజు రాత్రికే ఆయా గ్రామ పంచాయతీలకు సామగ్రితో సహా చేరుకోవాలని ఆదేశించారు. కమిషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేట్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగేటట్లయితే తగినన్ని లైట్లను ఏర్పాటు చేయాలని, అలాగే సిబ్బందికి భోజనం తదితర ఆహార ఏర్పాట్లను చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలపై నిఘా వేయాలని, కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్ ను నిరంతరం పర్యవేక్షి౦చాలని, అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు రికార్డు చేసిన డేటాను వినియోగించుకునే౦దుకు వాటిని నిక్షిప్తం చేయాలని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరమైన మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని చెప్తూ కొనుగోళ్లకు అవసరమైన నిధులను రేపు మధ్యాహ్నం లోపు ఎంపిడిఒలకు పంపించాలని జిల్లా అధికారులను కమిషనర్ ఆదేశించారు. గ్రామాల్లో విధులకు హాజరయ్యే మహిళా ఉద్యోగులకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎఎన్ఎం/ అంగన్ వాడీ కార్యకర్త/ వాలెంటీర్ కు, అలాగే పురుష సిబ్బందికి ఎఫ్ఎ/విఆర్ఓను తోడుగా ఉంచాలని, అవసరమైతే నాలుగో దశలో విధులు కేటాయించిన ఎంపిడిఒలను మొదటి దశకు కూడా వినియోగించుకోవాలని కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అన్ని అంశాలను పరిశీలిస్తూ, వారికి తగిన సూచనలు ఇవ్వాలని కమిషనర్ గిరిజా శంకర్ 12 జిల్లాల ఇంచార్జ్ అధికారులను ఆదేశించారు. మొదటి దశగా 12 జిల్లాల్లో జరుగనున్న ఈ ఎన్నికల్లో ఫిబ్రవరి 9వ తేదీన 2,736 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కాగా 513 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 23,754 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. 8,748 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నిర్వహణకు గానూ 33,193 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);          గ్రామ పంచాయతీ ఎన్నికలు- 2021 మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న జరుగనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,  కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ 12 జిల్లాల ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. 

ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ  బ్యాలెట్ పేపర్లు, స్వస్తిక్ మార్క్  రబ్బర్ స్టాంప్ లు, ఇండెలిబుల్ఇంకు తదితర ఎన్నికల సామాగ్రి ఆయా పోలింగ్ బూత్ లకు సోమవారం అంటే 8-2-2021 మధ్యాహ్నం కల్లా చేరాలని, ఆర్.ఓలు, పిఒలు అంతా పోలింగ్ కు సిద్ధంగా ఉండాలని, ఆయా రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని అంటూ పోలింగ్ సిబ్బంది ముందు రోజు రాత్రికే ఆయా గ్రామ పంచాయతీలకు సామగ్రితో సహా చేరుకోవాలని  ఆదేశించారు. 

కమిషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేట్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు రాత్రంతా జరిగేటట్లయితే తగినన్ని  లైట్లను ఏర్పాటు చేయాలని, అలాగే సిబ్బందికి భోజనం తదితర ఆహార ఏర్పాట్లను చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వెబ్ కాస్టింగ్ ద్వారా అన్ని కేంద్రాలపై నిఘా వేయాలని, కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్ ను నిరంతరం పర్యవేక్షి౦చాలని, అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు రికార్డు చేసిన డేటాను వినియోగించుకునే౦దుకు వాటిని నిక్షిప్తం చేయాలని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరమైన మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని చెప్తూ కొనుగోళ్లకు అవసరమైన నిధులను రేపు మధ్యాహ్నం లోపు ఎంపిడిఒలకు పంపించాలని జిల్లా అధికారులను కమిషనర్ ఆదేశించారు. 

గ్రామాల్లో విధులకు హాజరయ్యే మహిళా ఉద్యోగులకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎఎన్ఎం/ అంగన్ వాడీ కార్యకర్త/ వాలెంటీర్ కు, అలాగే పురుష సిబ్బందికి ఎఫ్ఎ/విఆర్ఓను తోడుగా ఉంచాలని, అవసరమైతే నాలుగో దశలో విధులు కేటాయించిన ఎంపిడిఒలను మొదటి దశకు కూడా వినియోగించుకోవాలని కమిషనర్ గిరిజా శంకర్ జిల్లా అధికారులకు సూచించారు. 

జిల్లా ఎన్నికల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అన్ని అంశాలను పరిశీలిస్తూ, వారికి తగిన సూచనలు ఇవ్వాలని కమిషనర్ గిరిజా శంకర్ 12 జిల్లాల ఇంచార్జ్ అధికారులను ఆదేశించారు. 

మొదటి దశగా 12 జిల్లాల్లో జరుగనున్న ఈ ఎన్నికల్లో ఫిబ్రవరి 9వ తేదీన 2,736  సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కాగా 513 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 23,754 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక జరగనుంది. 8,748 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నిర్వహణకు గానూ 33,193 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు.