కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌ వీడియో కాన్ఫరె

 . అమరావతి (prajaamaravathi);*కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌ వీడియో కాన్ఫరె



న్స్‌*: కోవిడ్‌ నియంత్రణకు మనకు ఉన్న అస్త్రం వాక్సిన్‌ అందుకే దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అదే విధంగా టెస్టులు. కోవిడ్‌ ఆస్పత్రులను సన్నద్ధం చేయాలి హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తప్పనిసరిగా వాక్సిన్‌ ఎక్కడా కోవిడ్‌ వాక్సిన్‌ను వృథా చేయొద్దు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలి ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోండి కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలందించాలి ఐసొలేషన్‌కు ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి. శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ ఉండాలి అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాలి రోగిని ఎప్పటికప్పుడు చెక్‌ చేయడం కూడా మన బాధ్యత 104 కాల్‌ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలి కోవిడ్‌ సమస్యలకు ఈ నెంబరు ఏకైక గమ్యంగా ఉండాలి గ్రీవెన్స్‌ కోసం కేటాయించిన 1902 నెంబర్‌ను అటెండ్‌ చేయాలి ఏ సమస్యపై ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కరించాలి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి *అమరావతి*: *కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ. కోవిడ్‌ వాక్సినేషన్‌పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు*. *ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..*: *వారి సేవలు ప్రశంసనీయం*: ‘ఇవాళ మనం ఎందుకు సమావేశమయ్యామన్నది మీ అందరికి తెలుసు. కోవిడ్‌ కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. వాటిని వెంటనే నియంత్రించాల్సి ఉంది. గత ఏడాది నుంచి జిల్లా యంత్రాంగాలు చాలా బాగా పని చేస్తున్నాయి. కోవిడ్‌ నియంత్రణలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మొదలు గ్రామ సచివాలయాల సిబ్బంది వరకు చాలా బాగా పని చేస్తున్నారు. వారి సేవలు ప్రశంసనీయం. ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో తిరిగి పని చేయాల్సిన అవసరం వచ్చింది’. *వాక్సినేషన్‌ ఒక్కటే..:* ‘వాక్సినేషన్‌ అనేది శాశ్వత పరిష్కారం. అయితే అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఆ డోస్‌లు కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. నెలకు 7 కోట్ల వ్యాక్సీన్లు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు 23 లక్షల డోస్‌లు తయారవుతున్నాయి. వాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ కేంద్రానిదే. దీంతో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు వీలైనంత వరకు అందరికి వాక్సిన్‌ ఇవ్వడంతో పాటు, మరోవైపు కోవిడ్‌ వ్యాప్తిని అరి కట్టాల్సి ఉంది’. *పరీక్షలు–పాజిటివిటీ:* ‘రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 1.55 కోట్ల పరీక్షలు చేయగా 9.37 లక్షల కేసులు పాజిటివ్‌గా తేలాయి. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 6.03 శాతం కాగా, రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది. అదే సమయంలో దేశ సగటు చూస్తే రికవరీ రేటు 88.9 «శాతం మాత్రమే. రాష్ట్రంలో టయర్‌–1 వంటి నగరాలు లేకపోయినా మనం మనకున్న వసతులతో బాగా పని చేయగలిగాం. కోవిడ్‌ కేసులను గుర్తించి పరీక్షలు చేయడంతో పాటు, అవసరమైన చికిత్స చేశాం. ఈ ప్రక్రియలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలతో పాటు, సచివాలయాలు కీలకపాత్ర పోషించాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.78 శాతంగా ఉండగా, జాతీయ స్థాయిలో అది 1.24 శాతంగా ఉంది. ఇవన్నీ మనకున్న పాజిటివ్‌ అంశాలు’. ‘దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. గత డిసెంబరు నుంచి ఏప్రిల్‌ మధ్య వరకు పాజిటివ్‌ రేటు 7.77 శాతం నమోదైంది. ఇన్ఫెక్షన్, పాజిటివిటీ రేటు చిత్తూరులో ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది’. *లాక్‌డౌన్‌ లేకుండా..:* ‘ఇది కష్టకాలం కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోవాలి. లాక్‌డౌన్‌ విధించకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలు దెబ్బ తినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ వి«ధించడం లేదు. గత ఏడాది చూశాం. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు’. *ఫోకస్డ్‌ టెస్టింగ్‌:* ‘ఇప్పుడు మనకు ఉన్న అస్త్రం వాక్సిన్‌. అందువల్ల లాక్‌డౌన్‌ అన్న మాట రాకుండా కోవిడ్‌ నియంత్రణపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలి. కాబట్టి, ఫోకస్డ్‌ టెస్టింగ్‌. అంటే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను టెస్టు చేయడం. దాన్నే ఫోకస్డ్‌ టెస్టింగ్‌ అంటారు. అదే విధంగా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టు చేయించుకోవాలంటే, వారికి కూడా వెంటనే చేయాలి. ఆ విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లలో టెస్టులు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి. అక్కడ శాంపిల్స్‌ సేకరించాలి’. *గ్రామీణ ప్రాంతాల్లో.*.: ‘పాజిటివిటీ కేసుల కాంపోజిషన్‌ చూస్తే 62 శాతం పట్టణ ప్రాంతాల్లో, 38 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. అయితే మరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. పాజిటివ్‌ కేసుల్లో మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం చాలా ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్లడం. అందువల్లనే మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి’. *అవగాహన కల్పించాలి*: ‘కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. అందుకోసం వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఉపయోగించాలి. అవసరం అనుకున్న వారికి ఫీవర్‌ టెస్టులు చేయాలి. అక్కడ కూడా వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల వైద్యులను వినియోగించండి. మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు చాలా కీలకం. సర్వేలో కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి గుర్తించిన వెంటనే, పరీక్షలు చేయాలి. అలా చేస్తేనే కోవిడ్‌ ఉందా లేదా అని తెలుస్తుంది’. *ఎప్పటికప్పుడు సమీక్ష*: ‘కలెక్టర్లు దృష్టి పెట్టాల్సిన మరో అంశం.. జాయింట్‌ కలెక్టర్ల (డెవలప్‌మెంట్‌)తో ప్రతి రోజూ మానిటర్‌ చేయాలి. ఇక జేసీలు ప్రతి నిమిషం, ప్రతి గంటకు పరిస్థితిని, ఆస్పత్రుల ప్రిపేర్డ్‌నెస్‌ను సమీక్షించాలి. కలెక్టర్లు ప్రతి రోజూ సమీక్షించాలి’. *వాటిని పెంచాల్సి ఉంది:* ‘గత ఏడాది సెప్టెంబరులో 261 ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించడం, తీసుకోవడం జరిగింది. అందులో సగం ప్రభుత్వ ఆస్పత్రులు కాగా, మిగిలినవి ప్రైవేటు ఆస్పత్రులు. 37,441 బెడ్లు వాటిలో అందుబాటులో ఉండగా, 17,921 నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్లు ఉండేవి. కాగా, ఇప్పుడు 108 ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్స కోసం ఎంప్యానెల్‌ చేయడం జరిగింది. అందులో కూడా సగం ప్రభుత్వ ఆస్పత్రులు. వాటిలో 15,669 బెడ్లు ఉండగా, 4,889 ఆక్యుపైడ్‌ బెడ్లు. కాగా ఇప్పుడు గత ఏడాది సెప్టెంబరులో ఉన్న విధంగా బెడ్లు కావాలి మనకు. ఆ మేరకు లక్ష్యం నిర్దేశించుకుని బెడ్లు పెంచాలి’. ‘ఇప్పటికిప్పుడు మనకు అవసరమైన ఐసీయూ బెడ్లు, ఆక్సీజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని ఇంకా పెంచుకోవాల్సి ఉంది’. *అవన్నీ మన భాద్యత:* ‘మనం ఆస్పత్రులను తీసుకోవడం అంటే, వాటిని ఓన్‌ చేసుకోవడం. ఆక్సీజన్‌ సదుపాయాలు. అందుకు తగిన మౌలిక వసతులు ఉన్నాయా? అన్నది చూడాలి. ఆస్పత్రిలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటు.. ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోండి. దీన్ని కలెక్టర్లు గుర్తించాలి’. *కోవిడ్‌ కేర్‌ సెంటర్లు*: ‘ఇంట్లో ఐసొలేషన్‌ కోసం ప్రత్యేక గది లేకపోతే, రోగిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి. అక్కడ కూడా శానిటేషన్, మెడికేషన్, ఫుడ్‌ క్వాలిటీ, మందులు అందుబాటులో ఉంచడం, ఎప్పటికప్పుడు చెక్‌ చేయడం కూడా మన బాధ్యత. రాష్ట్రంలో ఇప్పుడు 26 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 13,500 బెడ్లు ఉండగా, మనం వాటి సంఖ్యను గత సెప్టెంబరు నాటితో చూస్తే, అంటే 50 వేల బెడ్లకు పెంచాల్సిన అవసరం ఉంది’. *హోం ఐసొలేషన్‌:* ‘హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి సంబంధించి.. వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల సర్వే ద్వారా కోవిడ్‌ కేసుల నిర్ధారణ చేసిన తర్వాత లేదా 104 కాల్‌ సెంటర్‌ తర్వాత కోవిడ్‌ కేసు గుర్తిస్తే, వెంటనే ఆ ఇంటిని మార్క్‌ చేసి, ఆ ఇంట్లోని రోగికి వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వడంతో పాటు, రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి. మూడు రోజులకు ఒకసారి ఏఎన్‌ఎంలు ఆ ఇంటిని సందర్శించాలి. వారు పరిస్థితి చూసి, డాక్టర్‌ ఆ ఇంటికి వెళ్లేలా రిక్వెస్టు చేయాలి. రోగి పరిస్థితి బాగా లేకపోతే, కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించడం లేదా ఆస్పత్రిలో చేర్పించడంపై నిర్ణయం తీసుకుని అమలు చేయాలి’. *ఆస్పత్రులలో అవి తప్పనిసరి*: ‘అన్ని ఆస్పత్రులలో సీసీ టీవీలు ఉండాలి. అది తప్పనిసరి. అలాగే హెల్ప్‌ డెస్కులు కూడా ఉండి తీరాలి. అవి రోజంతా పని చేయాలి. ఆ రెండింటి ద్వారా ఆయా ఆస్పత్రులలో శానిటేషన్, ఫుడ్‌ క్వాలిటీ, వైద్యుల అందుబాటు, మందుల సరఫరా, ఆక్సీజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. గ్రామాల నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలో కోరితే, వెంటనే 108 సర్వీసులు వెళ్లి రోగులను తీసుకోవాలి’. *104 కాల్‌ సెంటర్‌:* ‘104 కాల్‌ సెంటర్‌ను ఓన్‌ చేసుకోవడం, కలెక్టర్లు ఆ పని చేయనంత వరకు, మనం తగిన విధంగా పని చేయలేం. 104కు ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే అటెండ్‌ చేయాలి. రియాక్ట్‌ కావాలి. అందువల్ల అవి ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి, రోజుకు రెండు, మూడు మాక్‌ కాల్స్‌ను కలెక్టర్లు చేయాలి. ఒక వేళ ఆ కాల్‌ సెంటర్‌ సక్రమంగా పని చేయడం లేదని గుర్తిస్తే, వెంటనే అన్నీ సరిదిద్దాలి. కాబట్టి 104 కాల్‌ సెంటర్లు సమర్థంగా పని చేసేలా చర్యలు చేపట్టాలి’. ‘104 నెంబర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే వైద్యులు అందుబాటులోకి వస్తారు. రోగితో మాట్లాడి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఇది సక్రమంగా జరగాలి. బెడ్‌ కావాలంటే, ఫోన్‌ చేసిన 3 గంటల్లో కేటాయించాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కూడా వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వాలి. అది కూడా 3 గంటల్లో పూర్తి కావాలి. అదే విధంగా 108 సర్వీసులో రోగిని అంతే సమయంలో తరలించాలి’. ‘104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వచ్చిన వెంటనే, సిబ్బంది వెళ్లాలి. పీహెచ్‌సీ నుంచి సిబ్బంది కదలాలి. 3 గంటల్లో అవసరమైన పరీక్షలు పూర్తి చేయాలి. కోవిడ్‌ కేర్‌కు సంబంధించి 104 నెంబరు మస్ట్‌ బి సింగిల్‌ డెస్టినేషన్‌. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి’. *ఉచితంగా సేవలు:* ‘కోవిడ్‌ రోగికి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రులలో రోగులకు మంచి వైద్య సేవలందించాలి. అవి కూడా పూర్తిగా ఉచితం. ఇది పక్కాగా అమలు కావాలి. అదే విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కూడా అవసరమైన కోవిడ్‌ చికిత్సలు చేయాలి. అవి కోవిడ్‌ ఎంప్యానెల్‌లో లేనప్పటికీ. రెమ్‌డెస్‌విర్‌ వంటి ఇంజెక్షన్లు, నాణ్యతతో కూడిన డ్రగ్స్‌ అన్ని ఆస్పత్రులలో అందుబాటులో ఉండాలి. ఆ విధంగా కలెక్టర్లు అన్నీ చూడాలి’. *కొరడా ఝలిపించండి:* ‘ఇదే కాకుండా, ఆరోగ్యశ్రీ, కోవిడ్‌ ఆస్పత్రుల జాబితాలో లేని ప్రైవేటు ఆస్పత్రులలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు, రుసుములు వసూలు చేయకుండా చూడాలి. అందుకోసం జీఓ నెం. 77, 78 ప్రకారం పక్కాగా అమలు చేయాలి. ఎక్కడైనా రోగుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం మీకు ఉంది. కోవిడ్‌ కష్టకాలంలో ఆస్పత్రులు రోగులను దోచుకోకుండా చూడాలి. అందు కోసం కఠినంగా వ్యవహరించండి’. *ప్రతి రోజూ రివ్యూ*: ‘ఆక్సీజన్‌ అందుబాటు గురించి కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి. ఎక్కడ ఆక్సీజన్‌ అవసరమున్నా, వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు, ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రతి రోజూ రివ్యూ చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌. మీకు ఏ అవసరం ఉన్నా వెంటనే వారిని సంప్రదించండి. ప్రతి జిల్లా బాధ్యతను ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి అప్పగించాం. వారు ఎప్పటిప్పుడు పరిస్థితి సమీక్షిస్తారు. మరోవైపు సీఎంఓ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటారు’. *సమస్యకు అదే పరిష్కారం*: ‘ఇంకా, వాక్సినేషన్‌. కోవిడ్‌ సమస్యకు ఇదే తుది పరిష్కారం. మనం ప్రతి రోజు 6 లక్షల వాక్సిన్లు వేసే స్థాయికి చేరుకున్నాం. ఆ సామర్థ్యం మనకు ఉంది. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు, ప్రతి గ్రామ సచివాలయంలో ఆశా వర్కర్, స్థానిక ఏఎన్‌ఎం, వలంటీర్లు ఉన్నారు. వారు ఇల్లిల్లూ సందర్శించి, వాక్సిన్‌ అవసరమైన వారిని గుర్తించి, ఏ రోజు వారికి వాక్సిన్‌ వేస్తారన్నది తెలియజేస్తారు. ఆ మేరకు నిర్దేశించిన రోజున స్థానిక పీహెచ్‌సీ వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు వచ్చి, వారందరికీ వాక్సిన్‌ వేస్తారు. ఇదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా వాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగాలి. గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వాక్సిన్లు ఇవ్వాలి. ఆ విధంగా రోజుకు 6 లక్షల వాక్సిన్లు. ఆ మేరకు వాక్సిన్‌ డోస్‌ల కోసం కేంద్రానికి లేఖ రాస్తున్నాం’. *వారికి వాక్సిన్‌ తప్పనిసరి*: ‘ఇదే సమయంలో ప్రతి హెల్త్‌ వర్కర్, ప్రతి ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌కు తప్పనిసరిగా వాక్సిన్‌ ఇవ్వాలి. అది చాలా సురక్షితమని చెప్పాలి. సీఎం కూడా తీసుకున్నారన్న విషయం చెప్పాలి. అలా ప్రతి హెల్త్‌ వర్కర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లందరికీ వాక్సిన్లు ఇవ్వాలి. హెల్త్‌ కేర్‌ వర్కర్లలో ఇంకా దాదాపు లక్ష మందికి వాక్సిన్లు ఇవ్వాల్సి ఉంది. విజయనగరం, కృష్ణా జిల్లాలలో వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది’. ‘ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో కూడా ఇంకా దాదాపు 1.8 లక్షల మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది. వారందరికీ వాక్సిన్‌ ప్రాధాన్యత వివరించి, ప్రతి ఒక్కరూ వాక్సిన్‌ వేసుకునేలా సిద్దం చేయాలి. ప్రతి ఒక్కరికి వాక్సిన్‌ ఇవ్వాలి’. *వాక్సిన్‌ వేస్టేజ్‌ వద్దు*: వాక్సిన్‌ వేస్టేజ్‌ లేకుండా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎక్కడా వాక్సిన్‌ వృథా కాకుండా చూడాలి. వాక్సిన్‌ వాయిల్స్‌ తెరవక ముందే తగిన సంఖ్యలో అది అవసరమైన వారు ఉన్నారా? లేదా? అన్నది చూడాలి. ఆ తర్వాతే వాక్సిన్‌ వేయాలి. అంతే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనే వాక్సిన్లు వృ«థా చేయొద్దు’. *1902 నెంబరు:* ‘ఇక 1902 నెంబర్‌. ఇది గ్రీవెన్స్‌ కోసం కేటాయించిన నెంబర్‌. సమస్యలు చెప్పుకోవడం కోసం ఆ నెంబర్‌. కాబట్టి ఫోన్‌ వస్తే, అటెండ్‌ చేయాలి. సమస్యలు పరిష్కరించాలి. ఆ విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పాలి’.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు నిర్దేశించారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి జరిగిన ఈ కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular posts
జగనన్న తోడు కార్యక్రమం బుధవారానికి వాయిదా : గ్రామ, వార్డు సచివాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్
పొదుపు సంఘాల మహిళలకు బాసటగా నిలుస్తున్న వైయస్సార్ ఆసరా అనంతపురం (ప్రజాఅమరావతి), సెప్టెంబర్ 16: వైయస్సార్ ఆసరా పథకం పొదుపు సంఘాల అక్కాచెల్లెళ్లకు బాసటగా నిలుస్తోంది. నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు నుండి జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, కాపు నేస్తం, విద్యాదీవెన, వైయస్సార్ చేయుత, రుణమాఫీ, ఇళ్లపట్టాలు మంజూరు, దిశ చట్టం అమలుతోపాటు ప్రస్తుతం అనేక ప్రభుత్వ పథకాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా లోకం చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మహిళలందరి తరఫున వైయస్ జగన్ కలకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనసారా ఆశీర్వదిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం శివారు ప్రాంతంలోని శిల్పారామం లో బుధవారం వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి విడతగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా 543 సంఘాలకు సుమారు రూ. 5.08 కోట్లు మంజూరు కావడంతో రుద్రంపేట, నారాయణపురం, రాజీవ్ కాలని, అనంతపురం రూరల్ పంచాయతీల గ్రామాల నుండి పొదుపు సంఘం మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసరా పథకం పై పలువురు పొదుపు సంఘాల మహిళలు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 1) వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన రోజు నుండి తమలాంటి పేద కుటుంబాల్లో పండుగ వాతావరణం వచ్చిందని శ్రీ భాగ్యలక్ష్మి పొదుపు మహిళా సంఘం సభ్యురాలు టీవీ టవర్ ప్రాంత నివాసి ఉష పేర్కొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల జీవితాలకు బంగారు బాటగా, ఒక మార్గదర్శిగా వైయస్సార్ ఆసరా పథకం ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. అక్కా చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలా అండగా నిలుస్తూ ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళల అప్పులన్నీ నాలుగు దశల్లో తమ ఖాతాల్లోకి జమ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడం లేదని మహిళల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రస్తుతం తనకు వైయస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.14,000 ఖాతాలో జమ అయిందని, తన కుటుంబానికి ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరు కావడంతో తన పిల్లలు బాగా చదువుతున్నారని పేర్కొంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది. 2) ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు.. అందులో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం ప్రవేశ పెట్టడం చాలా సంతోషం కలిగిస్తోందని అనంతపురం రూరల్ మండలం నగరం తపోవనంకు చెందిన ఈశ్వర సంఘం సభ్యురాలు ముత్యాలమ్మ తెలిపింది. గత ప్రభుత్వం మాకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, దానివల్ల చాలా నష్టపోయినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల జీవితాల్లో వెలుగు నింపుతున్నట్లు తెలిపింది. మహిళలకు కాపు నేస్తం ద్వారా ఐదు సంవత్సరాల్లో సుమారు రూ.75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ మొదటి సంవత్సరంలోనే ఇప్పటికే రూ.15 వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అలాగే ఒంటరి మహిళలకు, వితంతువులకు గతంలో పింఛన్లు కూడా సక్రమంగా మంజూరు కాలేదని, ప్రస్తుతం అర్హులైన వారందరికీ ప్రతినెల 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్లు అందుతున్నాయని తెలియజేసింది. ప్రజాసంక్షేమం కోసం, మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈశ్వర మహిళా పొదుపు సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం తనకు వైయస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.13 వేల రూపాయలు అందుతున్నదని, తమ్ సంఘ సభ్యులకు మొత్తం సుమారు ఒక లక్షా 31వేల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ కాబడినది అని తెలిపింది. తాను అమ్మబడి, పెన్షన్ లాంటి పథకాల ద్వారా లబ్ది పొందుతున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఈ డబ్బుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటానని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. 3) మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అందిస్తున్నారని నారాయణపురం పంచాయతీకి చెందిన అల్లామదీనా ముస్లిం మైనారిటీ పొదుపు సంఘం సభ్యురాలు ఎస్. ఫాతీమా తెలియజేసింది. వైయస్సార్ ఆసరా లాంటి పథకం గతంలో ఎక్కడా కూడా ప్రారంభించలేదని, కుటుంబాలలోని మహిళలకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి గుర్తించి పొదుపు సంఘాలను ఆదుకుంటున్నట్లు తెలిపింది. చిన్న చిన్న వ్యాపారంతో తామంతా ఉపాధి పొందాలన్న ఆశయంతో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. మా కుటుంబాల బంగారు భవిష్యత్తుకు ముఖ్యకారకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని తెలియజేసింది. ప్రస్తుతం తమ సంఘానికి సుమారు రూ. 3,97,591 రూపాయలు తమ ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపింది. ఇంత పెద్ద సహాయాన్ని అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లబ్ధి పొందిన ఈ డబ్బుతో కిరాణా కొట్టు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించు ఉంటానని తెలియజేసింది. 4) గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తూ చేతల ప్రభుత్వంగా ప్రజలకు అన్ని విధాలుగా సేవలందిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని శ్రీ షిరిడీ సాయి పొదుపు మహిళా సంఘం సభ్యురాలు భువనేశ్వరి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పొదుపు సంఘాల కష్టసుఖాలను తెలుసుకొని ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని వైయస్సార్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపింది. మా లాంటి నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తున్నట్లు తెలిపింది. మహిళా అభివృద్ధి ద్వారానే కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించిన ప్రభుత్వం ప్రతి పథకాల్లో మహిళలకు చేయూత అందిస్తున్నట్లు తెలిపింది. మహిళా సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది. తన ఖాతాల్లోకి జమ అయిన డబ్బు ద్వారా పండ్ల వ్యాపారం చేసుకుంటానని, తమకోసం జగనన్న ఉన్నాడనే ఆత్మవిశ్వాసంతో జీవిస్తానని పేర్కొంది. ప్రస్తుతం తమ పొదుపు సంఘానికి 50వేల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపింది. ఇంత పెద్ద మనస్సుతో మమ్మల్ని ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది.
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
*BHEL center of excellence in AP* New Delhi (prajaamaravathi), September 11: Industries Minister Mekapati Goutham Reddy said Bharat Heavy Electrical Limited has agreed in principle to set up BHEL Centre of Excellence in Andhra Pradesh. The Minister requested BHEL CMD Nalin Singhal to partner in awarding skill certificates by state government and BHEL to the students who completed school education to which he responded positively and said they would partner in Skill development and support ITI Colleges. The Minister said entrepreneur program will start under the auspices of BHEL, and invited him to setup one solar panels plant in each district. Minister Mekapati Goutham Reddy met Niti Aayog CEO Amitab Kant and sought cooperation in upcoming 30 skill development colleges in the state. The Minister said the main sources for revenue in the state are Agriculture and Industries and sought cooperation of Niti Aayog in those sectors to which Amitab Kant responded positively and expressed his willingness to organise Digital Conclave in Vizag at any time from October. The Minister also met DRDO Chairman Gundra Satish Reddy and Officials of Navy and Airforce and said the Government of Andhra Pradesh has laid special focus on 'Defence' in its new industrial policy and sought DRDO cooperation in this sector. The Minister asked Navy Chief Admiral Karambhir Singh to setup Sonic system in Donakonda and also to establish Naval Base at Ramayapatnam port. Later, The Minister met Airforce Chief Air chief Marshal B.S Dhanova and sought cooperation for development of Defence systems in the state.
Image
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image