నేడు (20వ తేదీ మంగళవారం) వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ 

నేడు (20వ తేదీ మంగళవారం) వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పధకం 6,27,906 లక్షల రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలలో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌: అమరావతి (prajaamaravathi): రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల çపథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, గరిష్టంగా ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపచేస్తున్నారు. ఆ మేరకు రైతులకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. అదే కోవలో రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాది లోపు తిరిగి చెల్లించిన 6,27,906 లక్షల రైతులందరికీ వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు వారి పొదుపు ఖాతాలలో మంగళవారం జమ చేస్తున్నారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ పధకాల ద్వారా అన్నదాతలకు చేసిన సాయం మొత్తం రూ. 61,400 కోట్లు. గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పధకం ద్వారా ఖరీఫ్‌ 2019కి సంబంధించి 14.27 లక్షల రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమ చేయడం జరిగింది 2019–20 రబీ సీజన్‌లో లక్ష లోపు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా ఆ రుణాలు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులందరికీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. నిజానికి ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింప చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో కేవలం 2,50,550 మంది రైతుల మాత్రమే నమోదు చేసుకోవడంతో, మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన రైతులందరికీ ఇప్పుడు వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. ఆ మేరకు 6,27,906 మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్ల నగదు వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.