జిల్లా వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు (prajaamaravathi); "జిల్లా వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు


".జ్యోతిరావు ఫూలే అని కూడా పిలువబడే జ్యోతిరావు గోవిందరావు ఫులే (1827 ఏప్రిల్ 11 - 1890 నవంబరు 28) ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయితని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..  జ్యోతిరావు ఫూలే కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడాని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. జ్యోతిరావు ఫూలే భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..  మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఆదివారం జిల్లా వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో నివాళిలు అర్పించి ఆయన సేవలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని గారు, ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షుల ఉంగుటూరు శాసనసభ్యులు పూప్పాల వాసుబాబు, కొనియాడారు..  బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..  ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని అన్నారు..  1873 సెప్టెంబరు 24న , ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..  సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారాని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..  జ్యోతిరావు ఫూలే, వారి భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..  జ్యోతిరావు ఫూలే మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..  ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించారు..  జ్యోతిరావు పులే వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..  భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో పులే గారు ఉన్నారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..  విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.. 

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image