కరోనా వ్యాప్తి కాకుండా పటిష్ట చర్యలు చేపట్టండి: కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.


 కరోనా వ్యాప్తి కాకుండా పటిష్ట చర్యలు చేపట్టండి: కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.


అమరావతి,2 ఏప్రిల్ (ప్రజా అమరావతి): కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికం అవుతున్న నేపథ్యంలో వివిధ  రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఆయన ఢిల్లీ నుండి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ ముఖ్యంగా 8 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయని ఈపరిస్థితుల్లో ఆయా రాష్ట్రాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్ లకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుని అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ముఖ్యంగా అధిక సంఖ్యలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.అదే విధంగా పటిష్టమైన కంటైన్మెంట్ చర్యలు చేపట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.గురువారం ఒక్కరోజే దేశంలో 81 వేల కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంతటి తీవ్ర స్థాయికి చేరిందో అర్థం అవుతుందని అన్నారు.

45యేళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ కు అనుమతి ఇచ్చినందున వారికందరికీ పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందించాలని చెప్పారు.

కరోనా నిర్థారణ అయినవారికి తగిన వైద్య సేవలు అందించడమే గాక వారితో సన్నిహితంగా మెలిగిన (కాంటాక్ట్స్)వారిని కూడా మూడు రోజుల్లోగా గుర్తించి వారిని హోం ఐసోలేషన్లో ఉంచాలని రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. అంతేగాక గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ,ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు.అయా వైద్యశాలల్లో మరిన్ని ఐసోలేషన్, ఆక్సిజన్ పాఠకులను అందుబాటులో ఉంచాలని సూచించారు.

మార్కెట్లు,మాల్స్,రాజకీయ, సాంస్కృతిక,ప్రార్థనాపరమైన కార్యక్రమాలు జరిగేచోట్ల ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కోకు నిర్మించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు స్పష్టం చేశారు.

విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కె.భాస్కర్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.


Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image