కోవిడ్ నిబంధనల మేరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం: టిటిడి ఈఓ డాక్టర్ కెఏస్.జవహర్ రెడ్డి

 ఒంటిమిట్ట,  ఏప్రిల్ 09 (prajaamaravathi); కోవిడ్ నిబంధనల మేరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం: టిటిడి ఈఓ డాక్టర్ కెఏస్.జవహర్ రెడ్డి ఏప్రిల్ 26న కల్యాణానికి విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 26న జరుగనున్న రాములవారి కల్యాణానికి కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని, ఇందుకోసం 5 వేల మందికి పాసులు జారీ చేస్తామని టిటిడి ఈఓ డాక్టర్ కెఏస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్, ఎస్పీ శ్రీ అన్బురాజన్ తో కలిసి ఈఓ పరిశీలించారు. అనంతరం రాములవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు . ఏప్రిల్ 26న రాత్రి 8 గంటలకు రాములవారి కల్యాణం నిర్వహించాలని టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తొలిసారిగా కల్యాణానికి విచ్చేయనున్నట్టు తెలిపారు. కల్యాణవేదిక వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపడతామన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, పాసులు పొందలేనివారు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణాన్ని వీక్షించవచ్చన్నారు. భక్తులందరూ టిటిడికి సహకరించాలని ఈ సందర్భంగా ఈఓ విజ్ఞప్తి చేశారు. ఈఓ వెంట స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జున రెడ్డి, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నార.   తిరుమల, 2021 ఏప్రిల్ 09 తిరుమ‌ల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో తిరుమ‌లలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పార్కింగ్ స్థ‌లాల‌ను టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోసినాథ్ జెట్టితో క‌లిసి శుక్ర‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. అనంత‌రం అద‌నపు ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల సౌక‌ర్యార్థం మ‌రిన్ని పార్కింగ్ స్థ‌లాల‌ను తిరుమ‌ల‌లో అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. యాత్రికులు గ‌దులు తీసుకున్న ప‌రిస‌రాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తే వారికి మ‌రింత సౌక‌ర్యావంతంగా ఉంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో 4000 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంద‌ని, అద‌నంగా మ‌రో 3000 వాహనాలకు పార్కింగ్ క‌ల్పించేందుకు టిటిడి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని చెప్పారు. మ‌ల్టీలెవ‌ల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయ‌డానికి ముల్లగుంట‌, సేవాస‌ద‌న్ ప‌క్క‌న‌‌‌ ఉన్న ప్రాంతా‌ల్లో అవ‌కాశం ఉంద‌న్నారు. అదేవిధంగా యాత్రికుల‌కు టైం స్లాట్ టికెట్ల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్నందున పిఏసి - 5 బ‌దులు మ‌ల్టీలెవ‌ల్ కార్ పార్కింగ్ నిర్మిస్తున్నామ‌న్నారు. తిరుమ‌ల‌లో ఆర్‌టిసి బ‌స్సులు ఎక్క‌వ అయినందున ప్ర‌స్తుతం ఉన్న గ్యారేజ్‌ బ‌దులు బాలాజి న‌గ‌ర్ స‌మీపంలోని కాళీ స్థ‌లంను అభివృద్ధి చేసి అక్క‌డ ఆర్‌టిసి గ్యారేజ్ నిర్మించ‌నున్న‌ట్లు వివ‌రించారు. కాగా అంత‌కుముందు ఈవో, అద‌న‌పు ఈవో తిరుమ‌ల‌లోని ముల్లగుంట‌, ఆర్‌బి స‌ర్కిల్, సేవాస‌ద‌న్ ప‌క్క‌న, ఎంప్లాయిస్ క్యాంటీన్ బ్యాక్ సైడ్, రాంబ‌గీచ బ‌స్టాండ్ ద‌గ్గ‌ర‌, బాలాజి న‌గ‌ర్‌, పిఏసి - 3 ఎదురుగా ఉన్న స్థ‌లం, ఔట‌ర్‌ రింగ్ రోడ్డు వంటి ప్రాంతాలను అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు. ‌ ఈ కార్య‌క్ర‌మంలో సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఏవిస్వో శ్రీ గంగ‌రాజు, ఇత‌ర ఇంజినీరింగ్ అధికారు‌లు పాల్గొన్నారు. -

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image