సంక్షేమ,అభివృధి కార్యక్రమాలు లబ్ధిదారులకు అందజేయడమే ప్రధాన లక్ష్యం.

  సంక్షేమ,అభివృధి కార్యక్రమాలు లబ్ధిదారులకు అందజేయడమే ప్రధాన లక్ష్యం.


పథకాలు సత్వరం అందజేయడానికి వలంటీర్ వ్యవస్థ.డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. కురుపాం, ఏప్రిల్ 14 (prajaamaravathi):- కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రజలలో మమేకమై నిరంతరం ప్రభుత్వ అభివృధి, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నది వలెంటీర్లేనని. గత 20 నెలలుగా ప్రజలకు సేవలందించే ఘనత వలెంటీర్లేదేనని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖా మాత్యులు పాముల పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. కురుపాం నియోజక వర్గంలో కురుపాం, గుమ్మలక్ష్మి పురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలకు సంబంధించిన గ్రామ సచివాలయ వలెంటీర్లకు కురుపాం మండల కేంద్రం సాయిబాబా గుడి దగ్గరలో ఉన్న మైదానంలో బుధవారం సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి,గిరిజన శాఖా మంత్రి పాముల పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వలంటీర్లకు సేవా వజ్ర, 25 మందికి సేవా రత్న, 1347 మందికి సేవా మిత్ర పురస్కారాలతో సత్కరించారు. ప్రశంసా పత్రం, బ్యాడ్, దుస్సాలువాలతో సత్కరించారు. సేవా వజ్రకు రు. 30వేలు, సేవా రత్నకు రు.20 వేలు, సేవా మిత్రకు రు.10వేలు చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్య మంత్రి పుష్ప శ్రీవాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని o ప్రారంభించారు. ముందుగా డా.బి.ఆర్.అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు, ఈ సందర్భంగా అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యం వలంటీర్ల, సచివాలయాలతో సాధ్యమైందన్నారు. ఉగాది పురస్కారాల సందర్భంగా కురుపాం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అందజేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ముఖ్య మంత్రి గారి ఆదర్శాలకు, ఆలోచనలతో చివరిలందిదారుని వరకు నేరుగా బ్యాంక్ ఖాతాలో లబ్ధి చేకూరేలా చేయడం జరిగిందన్నారు. ప్రజలకు సేవలదిస్తున్న వలంటీర్లకు పురస్కారం అందిస్తున్న ఘనత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. కరోనా విజృభిస్తున్న సమయంలో జగనన్న మాటకోసం ప్రజలకు సేవలందించే ఘనత వలెంటీర్లదే అన్నారు. ముఖ్య మంత్రికి సామాన్య మానవుడికి వారధి వలెంటీర్లు అన్నారు. పెన్షన్, ఇల్లు,రేషన్ కార్డ్,అమ్మావడి,రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక మరెన్నో పథకాలు లబ్ధిదారులు ఏటువంటి వ్యయ ప్రయాసలు పడకుండా వలంటీర్ ద్వారా సత్వరం పూర్తి అవుతున్నాయన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహార్ లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు చేరువ అవుతాయని అందూనిమితం వారిలో పదకలపై అవగాహన కల్పించే భాధ్యత వలంటీర్లదే అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉంది అన్నారు. ఇందుకు వాలంటీర్లు కూడా కారణం అన్నారు. కరోనా కేసులు సుమారు రెండు నెలలపాటు జిల్లాలో రాకుండా ఆడుకోవడం, మరణాలు నియంత్రించడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న దృశ్య ప్రజలంతా మస్కులు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా, చేతులు పలుమార్లు శుభ్రపరచుకోనేలా ప్రజలలో అవగాహన కల్పించే భాధ్యత వలంటీర్లదే అన్నారు కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లీ మండలం చినగుడబ సచివాలయానికి చెందిన వలంటీర్ ఎలగాడ సింహాచలం తన అభిప్రాయాన్ని తెలిపారు. కార్యక్రమలో జాయింట్ కలెక్టర్ (అభివృధి) డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి, ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ విధెహ ఖరె, జిల్లా పరిషత్ సి. ఇ. ఓ టి.వెంకటేశ్వర రావు, కురుపాం గ్రామ సర్పంచ్ సుజాత ఐదు మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి ఓలు, ఐ.టి.డి. ఎ ఆధికారులు, సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 

Comments