ఏపీ అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్ట్‌ గుంటూరు జిల్లాలో విస్తరణ సందర్భంగా పలువురు పాడిరైతులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

అమరావతి (prajaamaravathi); ఏపీ అమూల్‌ పాలవెల్లువ ప్రాజెక్ట్‌ గుంటూరు జిల్లాలో విస్తరణ సందర్భంగా పలువురు పాడిరైతులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.


* *నాదెండ్ల మండలం చందవరం నుంచి కే. ప్రభావతి* మాకు రెండు గేదెలు ఉన్నాయి, రోజూ 5 లీటర్ల పాలు పోస్తున్నాం, గతంలో ప్రైవేట్‌ డెయిరీలకు పాలు పోశాం. రోజుకూ లీటర్‌ రూ. 35 నుంచి రూ. 45 వరకూ వచ్చేవి, కానీ ఏం మిగిలేవి కావు, ఇప్పుడు అమూల్‌ డెయిరీకి పోయడం వల్ల లీటర్‌ కు అదనంగా రూ. 20 ఎక్కువ వస్తుంది, లీటర్‌ పాలు రూ. 60 నుంచి రూ. 70 వరకూ రావడంతో చాలా సంతోషంగా ఉంది, మా కుటుంబానికి ఆదారంగా నిలబడుతుంది, మీకు ధన్యవాదాలు, మా కుటుంబంలో అన్ని పధకాలు అందుతున్నాయి, మీ పరిపాలన బావుంది, అందరూ సంతోషంగా ఉన్నాం సార్‌. ప్రతీ ఒక్కరినీ మీ కుటంబంలా చూస్తున్నారు సార్, మా ఊరి తరపున మీకు ధన్యవాదాలు సార్‌ *ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం నుంచి మార్తమ్మ* పాలవెల్లువ మహిళా డెయిరీలో నేను సభ్యురాలిని, నేను ఈ పది రోజుల్లో 40 లీటర్ల పాలు పోస్తే రూ. 2120 వచ్చాయి, గతంలో మాకు పది రోజులకు రూ. 1800 మాత్రమే వచ్చేవి, లీటర్‌కు అదనంగా రూ. 10 వస్తున్నాయి, మాకు సంతోషంగా ఉంది. పాల వెన్న శాతం కచ్చితంగా చూస్తున్నాం, నాడు నేడు కింద మా గ్రామంలో అన్నీ మార్చారు, మాకు ఇళ్ళ పట్టాలు వచ్చాయి, మా అత్తగారికి వైఎస్‌ఆర్‌ ఆసరా కింద రూ. 18,750 డబ్బు అందింది, మా పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుతున్నారు. డ్వాక్రా లోన్‌ తీసుకుని గేదెను కొనుక్కున్నాం, ఇప్పుడు ఇంకో గేదెను కొనాలనుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలను మా మహిళలకు ఏర్పాటుచేసినందుకు మీకు ధన్యవాదాలు *నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ నుంచి నందిని* సార్‌ నేను మహిళా డెయిరీలో సెక్రటరీగా పనిచేస్తున్నా...ఈ డెయిరీలో ఆటోమెటిక్‌ పరికరాల వల్ల ఫ్యాట్‌ శాతం కానీ ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం కరెక్ట్‌గా వస్తున్నాయి, దీంతో పాడిరైతులకు డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి, రైతులు కూడా సంతోషంగా ఉన్నారు, మేం చాలా సంతోషంగా ఉన్నాం, ఈ డెయిరీ మా ఊరిలో పెట్టడం వల్ల అందరం సంతోషంగా ఉన్నాం, అన్ని పధకాలు మాకు అందుతున్నాయి, రైతుల కోసం మీరు చేసే ప్రతీ పధకం వల్ల రైతులందరూ సంతోషంగా ఉన్నాం, మీరు మహిళా సంక్షేమం కోసం మీరు పెడుతున్న పధకాలు మాకు అందుతున్నాయి, పుట్టినింటిలో పొందే ఆనందం మెట్టినింటిలో కూడా పొందుతున్నాం, చాలామంది రైతులు ముందుకొచ్చి మేం కూడా మీ డెయిరీలో పాలు పోస్తాం అంటున్నారు. మీరు చేస్తున్న సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు రావడం లేదు. మాకు ఒక్క అన్నలా మీరు సాయం చేస్తున్నారు. మీకు రుణపడి ఉంటాం సీఎంగారు. మా ఊరి తరపున మీకు ధన్యవాదాలు. *నాదెండ్ల మండలం గొరిజవోలు నుంచి కే. పద్మ* నాకు ఇంతకు ముందు మూడు గేదెలు ఉన్నాయి, పాలు అమ్మినా సరైన ధర రాక రెండు ఆమ్మేశాం ఇప్పుడు ఒకటే ఉంది, మన డెయిరీలో పాలు పోస్తుంటే లీటర్‌ రూ. 50 నుంచి రూ. 55 పడుతుంది, మా బాబుకు వసతిదీవెన అందింది, నేను డ్వాక్రా సభ్యురాలిని, మాకు డబ్బులు అందాయి, నేను ఇంకొక గేదె కొనుక్కోవాలి అనుకుంటున్నాను, సబ్సిడీ మీద గేదె ఇస్తే లబ్దిపొందుతాను అని విన్నవించగా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ మీరు వైఎస్‌ఆర్‌ చేయూతలో దరఖాస్తు చేయండి, సంబంధిత అధికారులు మీకు సహాయం చేస్తారని హమీ ఇచ్చారు.