జిల్లాకు 50 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అపోలో యాజమాన్యం వారు అందజేయడం శుభపరిణామం జిల్లాకు 50 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అపోలో యాజమాన్యం వారు అందజేయడం శుభపరిణామం


.

 

                      *: డిప్యూటీ సిఎం* 


 *చిత్తూరు జిల్లాలో కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అపోలో యాజమాన్యం ముందుకు రావాలి* 

 

                       *: చిత్తూరు ఎంపి*

  

 *విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించడం స్వాగతించ దగిన విషయం* 

 

                         *: జిల్లా కలెక్టర్*

 

 *రాష్ట్రం మరియు జిల్లాలో కోవిడ్ బాధితులకు అపోలో తరఫున వైద్య సేవలు అందించేందుకు ముందంజలో ఉంటాం* 


             *: అపోలో గ్రూప్ ఛైర్మన్*

 

 చిత్తూరు, మే 11 (ప్రజా అమరావతి): దేశం మొత్తం కరోనా దృష్ట్యా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారని చిత్తూరు జిల్లాలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు అపోలో యాజమాన్యం వారు 50 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడం శుభపరిణామమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మురకంబట్టు వద్ద గల అపోలో మెడికల్ కాలేజీ నందు అపోలో యాజమాన్యం తరఫున 50 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను డిప్యూటీ సిఎం, చిత్తూరు ఎంపి, చిత్తూరు, పూతలపట్టు శాసన సభ్యుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ కు అందజేశారు. 

ఈ కార్యక్రమమ అనంతరం ఉప ముఖ్యమంత్రి, చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్ప, చిత్తూరు, పూతలపట్టు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎస్. బాబు, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, ఇతర ప్రజాప్రతినిధులు అపోలో గ్రూప్ ఛైర్మన్ డా. ప్రతాప్ సి.రెడ్డి తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సి ఎం మాట్లాడుతూ మానవతా ధృక్పథంతో అపోలో యాజమాన్యం వారు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేయడం మంచి పరిణామమని, దీనితో పాటు చిత్తూరు జిల్లాలో పడకల సామర్థ్యాన్ని పెంచి కోవిడ్ బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి, జిల్లాకు వైద్య సేవలు అందించేందుకు అపోలో యాజమాన్యం ముందుకు రావాలని అపోలో గ్రూప్ ఛైర్మన్ ను డిప్యూటీ సిఎం కోరారు. 

చిత్తూరు ఎం.పి ఎన్. రెడ్డెప్ప మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో గ్రూప్ యాజమాన్యం ముందుకు రావాలని, చిత్తూరు జిల్లాను దత్తత తీసుకుని వైద్య సేవలు అందించాలని కోరారు. 

చిత్తూరు ఎంఎల్ఏ మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి కోవిడ్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతున్నదని, అలాగే చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం వారు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పని చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.  

పూతలపట్టు శాసన సభ్యులు మాట్లాడుతూ అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి అరగొండలో ఆసుపత్రి నెలకొల్పి వైద్య సేవలు అందించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని, కరోనా సమయంలో పడకల సామర్థ్యాన్ని పెంచి ప్రజలకు వైద్య సేవలను అందించాలని కోరారు. 

నగరపాలక సంస్థ మేయర్ అముద మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, ప్రజలు మాస్క్ లు ధరించి భౌతిక దూరాలు పాటిస్తూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా తమను తాము రక్షించుకుంటూ వైరస్ వ్యాప్తిని నిరోధించాలని తెలిపారు. 

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు స్వీకరించే సమయంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు అపోలో యాజమాన్యం వారు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించడం స్వాగతించ దగిన విషయమని వారిని అభినందించారు.

అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం మరియు జిల్లాలో కోవిడ్ బాధితులకు అపోలో తరఫున వైద్య సేవలు అందించేందుకు ముందంజలో ఉంటామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని, వ్యాక్సినేషన్, కోవిడ్ పై ప్రజలకు అవగాహన పాక్షిక కర్ఫ్యూ, తదితర అంశాలతో కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కోవిడ్ బాధితులకు ఎటువంటి వైద్య సేవలైనా అందించేందుకు తాము ముందుకు వస్తామని, రాష్ట్ర ప్రభుత్వానికి  మరియు జిల్లా యంత్రాంగానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.   

ఈ కార్యక్రమంలో అపోలో యూనిట్ హెడ్ నరేష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ డా.శ్రీధర్, అపోలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Comments