స్పెషల్ స్టోరీ - రెండేళ్ల పరిపాలన - నవరత్నాల పథకం అమలులో "వైయస్సార్ పెన్షన్ కానుక"

 *స్పెషల్ స్టోరీ - రెండేళ్ల పరిపాలన - నవరత్నాల పథకం అమలులో "వైయస్సార్ పెన్షన్ కానుక"


.*


*నవరత్నాల పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలుపరుస్తున్న పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక :-*


*జిల్లాలో మొత్తం రెండేళ్ల పరిపాలనలో జిల్లాలోని 16  రకాల పింఛను లబ్ధిదారులకు రూ 2510.55 కోట్లు రూపాయలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం :-*


*అవ్వా తాతల ఆనందమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం :-*


*ఇంటివద్దకే పెన్షన్...లబ్ధిదారులకు తప్పిన పడిగాపులు :-*


కర్నూలు, మార్చి 30 (ప్రజా అమరావతి);


*ఆంధ్రప్రదేశ్ లో అన్ని సామాజిక వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన “నవరత్నాలు” అనే పేరుతో ఒక గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించి, ఒక కొత్త రికార్డు నెలకొల్పాడు. నవరత్నాలు లో భాగంగా, పెన్షన్ డబ్బు మొత్తాన్ని పెంచడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ కోసం వయస్సు పరిమితి ప్రమాణాలను తగ్గించడం. సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల కష్టాలను తీర్చడానికి ఒక ప్రధాన సంక్షేమ చర్యగా దేశంలోనే పేరు తెచ్చుకున్నది. ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనమైన వర్గాలకు చెందిన వారు, వితంతువులు మరియు వైకల్యం ఉన్నవారు గౌరవప్రదమైన జీవితాన్ని పొందటానికి ఈ వైయస్సార్ పెన్షన్ కానుక ఎంతగానో ఉపయోగపడుతుంది.*


*ఒకటో తారీఖు ఎప్పుడొస్తుందో.....పింఛన్ పంపిణీ చేసే ఉద్యోగి వస్తారో రారో....పనికి పోయి వచ్చే లోపు అతను వెళ్లిపోతే ఎలా.....ఇలాంటి సందేహాలు ఉండేవి. పింఛన్ పంపిణీ చేసే ఉద్యోగి అనివార్య కారణాలతో సమాయానికి రాకపోతే ఊసురు మంటూ వెనుతిరిగాల్సిన పనిలేదు. నడవలేని వారు ఇతరుల సాయం కోసం బతిమిలాడాల్సిన అవసరం అంతకంటే లేదు. నేరుగా లబ్దిదారులున్న చోటకే పింఛన్ సొమ్ము తీసుకువచ్చి ఇస్తున్నారు. ఇంత వరకు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక ప్రహసనంలా సాగింది. పండుటాకులు మంజూరు కేంద్రం వద్దకు వెళ్లి పడిగాపులు కాసేవారు. మరికొంత మంది నిరీక్షించలేక సొమ్మసిల్లి పడిపోయేవారు. ఈ కష్టాలను ప్రభుత్వం గమనించి ఆ విధానానికి స్వస్తిపలికింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పథకంలో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక' ప్రవేశపెట్టారు.*


*నవరత్నాల్లో ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న పథకం వైఎస్సార్ పెన్షన్ కానుక :-* 


వృద్ధాప్య పెన్షన్ రూ.2250, వితంతు పెన్షన్ రూ.2250, దివ్యంగా పెన్షన్ రూ.3000, చేనేత రూ.2250, కల్లు గీత కార్మికులు రూ.2250, ట్రాన్స్ జెండర్ రూ.3,000, ఒంటరి మహిళ రూ.2250,మత్స్యకార రూ.2250, సి డి కే యు ప్రైవేట్ (క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్) రూ.10,000, సి డి కే యు గవర్నమెంట్ (క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్) రూ.10,000, డప్పు కళాకారులు రూ.3000, చర్మకారులు రూ.2250, డి ఎం హెచ్ ఓ రూ.5000 &10,000,  ఆర్టిస్ట్ పెన్షన్ రూ.5000, అభయహస్తం పెన్షన్ రూ.500, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ రూ.3000 చొప్పున ప్రతి నెల ప్రభుత్వం పింఛన్ అందిస్తుంది. 


*కర్నూలు జిల్లాలో 2019 జూలై నుంచి 2021 మే వరకు వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ వివరాలు :-* 


కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు రెండేళ్ల పరిపాలనలో జిల్లాలోని 16 రకాల పింఛను లబ్ధిదారులకు మొత్తం రూ.2510.55 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇలా వృద్ధాప్య పెన్షన్ రూ.1055.43 కోట్లు, వితంతు పెన్షన్ రూ.9400.32 కోట్లు, దివ్యంగా పెన్షన్ రూ.3488.35 కోట్లు, చేనేత రూ.25,51,86,000 కోట్లు, కల్లు గీత కార్మికులు రూ.2,57,55,750 కోట్లు, ట్రాన్స్ జెండర్ రూ.3,24,69,000 కోట్లు, ఒంటరి మహిళ రూ.50,98,54,500 కోట్లు, మత్స్యకార రూ.10,94,62,500 కోట్లు, సిడి కే యు ప్రైవేట్ పెన్షన్ రూ 85,11,000, సిడి కే యు ప్రభుత్వ పెన్షన్ రూ 42,80,000, డప్పు కళాకారులు రూ.20,52,57,000 కోట్లు, చర్మకారులు రూ.10,80,85,500 కోట్లు, డి ఎం హెచ్ ఓ రూ.25,76,43,000 కోట్లు, ఆర్టిస్ట్ పెన్షన్ రూ.39,72,000, అభయహస్తం పెన్షన్ రూ.6,34,53,500 కోట్లు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ రూ.20,20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో పెన్షన్ దారులకు పెన్షన్ నిధులను విడుదల చేసింది. 


*కష్టాలు తప్పాయి :-* 


నా పేరు అన్వర్ భాష, నేను కర్నూలు నగరంలోని బుధవార పేటలో నివసిస్తున్నాను. నేను  దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నాను. నాకు రెండు చేతులు కూడా లేవు. మా ఇంటి దగ్గరికి వచ్చి నీకు పించన్ ఇస్తున్నాను బయటికి రా అంటే వచ్చినాను. నాకు కంటి ద్వారా ఏదో పెట్టి ఆ తర్వాత నాకు డబ్బులు ఇచ్చాడు. నాలాంటి దివ్యాంగులకు పింఛన్ కష్టాలు ఇప్పుడూ లేవు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమంతో వాలెంటర్ల్లు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. గతంలో పంచాయత్ ఆఫీస్ దగ్గరకు వెళ్లి గంటల తరబడి పింఛన్ల కోసం నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడు మా కష్టాలు తప్పాయి. *-అన్వర్ భాష, దివ్యాంగ పెన్షన్, బుధవార పేట, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.*


*ఇబ్బందులు పడనవసరం లేదు :-*


నా పేరు బి సుబ్బమ్మ, నేను చెరుకు చెర్ల గ్రామంలో నివసిస్తున్నాను. వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నాను. ప్రతి సారి పింఛన్ కోసం ఆఫీసుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. అ్కడికి వెళ్లినా ఒకసారి పడిగాపులు కాయాల్సి వచ్చేంది. ఇంటికే తెచ్చి మేము లేయకముందే వచ్చి మా ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. నేను కర్నూలు హాస్పిటల్ లో నాకు గతంలో కంటిచూపు ఉండడంతో హాస్పిటల్లో చూపించుకోగ అప్పట్లో మా వూరు వాలెంటర్ హాస్పటల్ కు వచ్చి డబ్బులు ఇచ్చాడు. ఇంటి వద్దకే పింఛన్ అందించడం చాలా బాగుంది. *-పి.సుబ్బమ్మ, వృద్ధాప్య పెన్షన్, చెరుకు చెర్ల గ్రామం,  కర్నూలు జిల్లా*.


*ఇంతకన్నా సంతోషం ఏముంది :-*


నా పేరు షేక్  షాలిబిన్, రామారావు గేట్, ఖoడేరి వార్డు నెంబర్ 1 లో నివసిస్తున్నాను. నేను వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నాను. ప్రతిసారి పింఛన్ కోసం ఆఫీసుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. అ్కడికి వెళ్లినా ఒకసారి పడిగాపులు కాయాల్సి వచ్చేంది. ఇలాంటి సమయంలో మా విధిలో ఉన్న అబ్బాయి నాకు పెన్షన్ డబ్బులు ఇచ్చడు. గతంలో లబ్దిదారులు ఎక్కువ మంది ఉండడం వలన కొన్ని సార్లు పింఛన్ల పంపిణీ వాయిదా పడేది. మూడు రోజులు పాటు ఆఫీసు చుట్టు తిరగే వాళ్లం. మాలాంటి వృద్ధులకు ఆదుకోవడంలో రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ బాబు దేవుడు. *-షేక్ షాలిబిన్, వృద్ధాప్య పెన్షన్, రామారావు గేట్, ఖoడేరి వార్డు నెంబర్ 1, కర్నూలు నగరం.*


*ఎవరు పట్టించుకోకపోయినా మా కష్టాలను చూసి జగన్ బాబు గుర్తించి ఆరోగ్య కోసం పెన్షన్ రూపంలో ఇవ్వడం చాలా గొప్ప విషయం :-*


నా పేరు అనంతమ్మ, నేను ఆదోనిలో నివసిస్తున్నాను. నేను నా ఆరోగ్యం బాగాలేక (డయాలసిస్) పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్నాను. ప్రతి నెల హాస్పిటల్ కి వెళ్లాల్సిందే. మా వీధిలో ఉన్న వాలింటర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి పదివేల రూపాయలు పెన్షన్ డబ్బులు ఇస్తున్నాడు. మా లాంటోళ్లకు ఇలాంటి డబ్బులు ఎంతో మేలు. ఎవరు పట్టించుకోకపోయినా మా కష్టాలను జగన్ బాబు గుర్తించి ఆరోగ్య కోసం పెన్షన్ రూపంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. *-అనంతమ్మ డయాలసిస్ పేషెంట్ కు పోర్టబుల్ పేమెంట్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ₹10 వేల పెన్షన్ అందిస్తున్న వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రెటరీ.