వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ కోరారు.విజయవాడ (ప్రజా అమరావతి);


వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో  ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ కోరారు.


శనివారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం ,వైద్యులతో నిర్వహించిన సమావేశంలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణ కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక పై కలెక్టర్ సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ జిజిహెచ్ కు అనుసంధానం గా 100 పడకలతో  నిర్వహించే కోవిడ్ సెంటర్లో మానవ దృక్పథంతో వైద్య సేవలు రొటేషన్ ప్రాతిపదికన  నెట్ వర్క్ ఆస్పత్రులు  ప్రతి ఆసుపత్రి 20 పడకలకు చొప్పున ప్రతి ఆసుపత్రి 10 రోజుల షిఫ్ట్ పద్ధతిన సేవలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా ఆయా ఆసుపత్రి నుండి ఒక ప్రత్యేక వైద్యుడు (వైద్యుడు) లేదా పల్మోనాలజిస్ట్ రౌండ్లు చేయవలసి ఉంటుందని,  ఆయా ఆసుపత్రి నుండి ముగ్గురు స్టాఫ్ నర్సులు (ప్రతి షిఫ్టులో ఒకరు) , ముగ్గురు నర్సింగ్ ఆర్డర్‌లీ (ప్రతి షిఫ్టులో ఒకరు),  ఫాలో-అప్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు వుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిపై చాలా భారం పడివున్నందున వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే ఏర్పాటు చేశామన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి తో పాటుగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు.


జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ మాట్లాడుతూ వ్యాపార దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో ప్రతి నెట్ వర్క్ ఆస్పత్రి లొ 50 శాతం బెడ్ల ను కోవిడ్ సేవలకు కేటాయించాలని కోరారు. ఆరోగ్యశ్రీ కింద సేవలు నిరాకరించవద్దని అన్నారు.


ఈ సమావేశంలో డియంహెచ్ ఓ డా.యం.సుహాసిని, డిసిహెచ్ జ్యోతిర్మణి,ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. కె.శివశంకర్ తో పాటు కామినేని హాస్పిటల్, విజయవాడ , ఆయుష్ న్రీ లెప్ల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ , క్యాపిటల్ హాస్పిటల్ నోహన్, టైమ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,. సెంటిని హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,. శ్రీ అను హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇండో-బ్రిటిష్ హాస్పిటల్, విజయవాడ , ఆంధ్ర హాస్పిటల్స్ మచిలిపట్నం విశ్వదీప్ మెడికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క యూనిట్ , ఆంధ్రాహోస్పిటల్స్విజయవాడప్విటిఎల్టిడి స్మితావో ,. కెవి షైన్ హాస్పిటల్. విజయా సూపర్ స్పెషల్ హాస్పిటల్ , హెల్ప్ హాస్పిటల్ 7 ఇ , అనీల్ న్యూరోస్ స్పెషల్  , సన్‌రైజ్ హాస్పిటల్ ,లిబర్టీ హాస్పిటల్స్. గాయత్రి హాస్పిటల్స్ , గ్లోబల్ మల్టీ స్పెసిహాటీ హోసైటల్స్.  AIMS హాస్పిటల్స్ ,సిటీ ఆర్థోపెడిక్ సెంటర్ల్ కు చెందిన వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు..