కృష్ణా జిల్లా లో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కి కేటాయించిన బెడ్ల వివరాలు ప్రముఖంగా ప్రదర్శించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు.విజయవాడ (ప్రజా అమరావతి);


కృష్ణా జిల్లా లో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కి కేటాయించిన బెడ్ల వివరాలు ప్రముఖంగా ప్రదర్శించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు.స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం పౌర సరఫరా ల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని) ,  గన్నవరం శాసన సభ్యులు వల్లభనేని వంశీ లు కలెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, జిల్లాలో అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ మార్గదర్శకాలు మేరకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో నిబంధనలు మేరకు కోవిడ్ భాదితులకు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారనే ఫిర్యాదు లు వస్తున్నాయన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో  ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని, అన్ని ప్రవేటు ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పరిధి లోకి తీసుకుని రావాల్సి ఉంది. అయితే కొన్ని ప్రవేటు ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించ కుండా ఇబ్బందులు గురిచేస్తున్న ఘటనలు పట్ల తీవ్రంగా వ్యవరించా లన్నారు. ఆరోగ్యశ్రీ తో వైద్య సేవలు అందిస్తూ డబ్బులు వసూలు కి కొన్ని ఆసుపత్రి యాజమాన్యాలు తీరు ఉంటోందన్న ఫిర్యాదులు పై మంత్రి అధికారులను వివరాలు అడిగారు. ఎప్పటికప్పుడు జిల్లాకు కావాల్సిన వ్యాక్సినేషన్ పై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ,  ఆరోగ్యశ్రీ ఆసుపత్రి సేవలకు సంబంధించిన అనుమతులు, తదితర అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కి ప్రత్యేక అధికారాలు ఉన్నాయన్నారు. జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ విభాగానికి అదనపు సిఈఓ అధికారాలను జేసీ కి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లాలో అవకతవకలకు పాల్పడిన నాలుగు ఆస్పత్రులపై చర్యల్లో భాగంగా అపరాధ రుసుము, అనుమతులు రద్దు వంటి చర్యలు తీసుకున్నారని వివరించారు.


ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, శాసన సభ్యులు వల్లభనేని వంశీ, జేసి ఎల్. శివశంకర్ పాల్గొన్నారు.