జిల్లాలో కోవిడ్ వైద్య సేవల నిర్వహణ,మౌలిక వసతుల పై నోడల్ అధికారులు మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు.

  

                         విజయవాడ (ప్రజా అమరావతి);


జిల్లాలో కోవిడ్ వైద్య సేవల నిర్వహణ,మౌలిక వసతుల పై నోడల్ అధికారులు మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు.శనివారం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, ఆస్పత్రుల్లలో మందులు సరఫరా, ఆహార, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణపై  కలెక్టర్ ఇంతియాజ్ వ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


జిల్లాలో ని 68 ఆస్పత్రుల పరిధిలో 5872  బెడ్స్ అందుబాటులో కి తెచ్చామన్నారు. ప్రతి ఆస్పత్రికి నియమించిన  నోడల్ అధికారి ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు పర్యవేక్షణ చేయాలని,ఇందుకు ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉండాలన్నారు. 24 గంటలు సమన్వయం చేసుకుంటూ, ఒక ప్రతినిధి అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు సంబంధించిన ఆసుపత్రి  సూపరింటెండెంట్ తో సమన్వయం చేసుకుంటు, ఆయా వివరాలు ప్రతి రెండు గంటలకు ఆన్ లైన్లో నమోదు చేయాలన్నారు.


వైద్యులు ఖచ్చితంగా కోవిడ్ వార్డుల ను సందర్శించాలన్నారు. ప్రతి రోజు నోడల్ అధికారులు కొంత మంది రోగులకు వాట్సాప్ కాల్ చేసి మనోధైర్యం ఇవ్వాలన్నారు.


రోగులకు అందించే ఆహారం, మందులు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.


కోవిడ్ వార్డుల్లో ,ఆస్పత్రి పరిసరాల్లో ప్రతి 4 గంటల కు ఒకసారి శానిటెషన్ జరిగేలా చూడాలన్నారు.


అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.


జిల్లాలో స్థిరంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న రోగులను హోమ్ ఐసోలాషన్ కు,కోవిడ్ కేర్ సెంటర్లో కు సిఫార్సు చేస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. తద్వారా బెడ్ల కొరత లేకుండా చూడగలమని తెలిపారు.  జిల్లాలో 104 కాల్ సెంటర్ ద్వారా వచ్చేవారి వివరాలను నమోదు చేసేందుకు 3 షిఫ్టు ల్లో 75 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఇంకా బెడ్ల కేటాయింపు  15 మందికి సంబంధించి పెండింగులో ఉన్నాయన్నారు. అవికూడా రాత్రి కల్లా పరిష్కరిస్తామన్నారు. నోడల్ అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటు న్నామని, 9 మంది నుంచి నివేదికలు అందాల్సివుందన్నారు. సిసి టీవీ ఏర్పాట్లు పై సంబంధించిన ఆస్పత్రి యాజమాన్య లతో మాట్లాడం జరిగిందన్నారు.

........


Comments