నూతన కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిలారి.

 నూతన కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిలారి.అన్ని ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కిలారి.


కరోన బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.


     పొన్నూరు (ప్రజా అమరావతి); పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన "న్యూ కోవిడ్ కేర్ సెంటర్" ( క్వారంటైన్ సెంటర్)ను పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య బుధవారం ప్రారంభించారు. 


            ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ కారోన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మెరుగైన చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ నందు అధికారులు, వైద్యాధికారులు, అంగన్ వాడి వర్కర్లు, నర్స్ లు, పారిశుధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని, ఎవ్వరు కూడా ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కిలారి బాధితులలో మనోధైర్యాన్ని కల్పించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగినట్లుగా భావించి బాధ్యతగా పని చేయాలని ఎమ్మెల్యే కిలారి రోశయ్య సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెంటర్ లో ఎమ్మెల్యే కిలారి ప్రతి రూమ్ ను సందర్శించి పరిశీలించడంతో పాటు టాయిలెట్లును కూడా పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.


వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కిలారి.


             మండల పరిధిలోని పచ్చలతాడిపర్రు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పరిశీలించారు. ఎమ్మెల్యే కిలారి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాక్సిన్ రెండోవ డోస్ వేయడం జరుగుతుందని, మొదటి డోస్ వేయించుకున్నవారు తప్పనిసరిగా రెండొవ డోస్ వేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కిలారి రోశయ్య తెలిపారు. మండల వ్యాప్తంగా మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న వారందరికీ పచ్చలతాడిపర్రు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోవ డోస్ వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సూచించారు.


తప్పుడు ప్రచారం మానుకోవాలి.


ఎమ్మెల్యే కిలారి రోశయ్య


              రాష్ట్రంలో పెద్దమనిషిగా చెప్పుకొనే కొంతమంది పెద్దలు కరోనపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే కిలారి రోశయ్య హెచ్చరించారు. మండల పరిధిలోని పచ్చలతాడిపర్రు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే కిలారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రజలు ఇప్పటికే బుద్దిచేప్పినా వారికి సిగ్గురాలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కోవిడ్-19 పై భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చర్యలు చేపట్టిందని *ఎమ్మెల్యే కిలారి* పేర్కొన్నారు. ప్రజలు కూడా సహకరించి కరోన వ్యాప్తి నివారణకు సహకరించాలని *ఎమ్మెల్యే కిలారి రోశయ్య* విజ్ఞప్తి చేశారు.