కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష:

 

అమరావతి (ప్రజా అమరావతి);



కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష:



*సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:*


కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడాలి.

ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదు.

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు అవసరమైన ఇంజక్షన్లు, ఇతర మందులను ఎక్కడ అందుబాటులో ఉన్నా సేకరించండి.

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందాలి. వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలను వీలైనంత వరకు ఎక్కువ ఆదాయం వచ్చే చోట్ల డిపాజిట్‌ చేయాలి.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులను సీఎంకు  వివరించిన అధికారులు

కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న కేసుల సంఖ్య కూడా తగ్గుతోందని వారు తెలిపారు.


*కేసులు–పాజిటివిటీ:*

పాజిటివిటీ రేటు 13.02 కు తగ్గుదల. గత మే 16న పాజివిటీ రేటు  25.56 శాతంగా నమోదు.

యాక్టివ్‌ కేసులు మే 17న 2.11 లక్షలు కాగా, జూన్‌ ప్రారంభం నాటికి 1.43 లక్షలు

కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందని, నమోదవుతున్న కేసులు కన్నా, వారి సంఖ్య అధికంగా ఉందన్న అధికారులు. రికవరీ రేటు 90.98 శాతానికి పెరుగుదల

కోవిడ్‌ కారణంగా క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా తగ్గిందని, ఐసీయూ బెడ్స్‌ మే 15న కేవలం 380 ఖాళీగా ఉంటే జూన్‌ 2న 1,582 అందుబాటులో ఉన్నాయని తెలిపిన అధికారులు. 

ఆక్సిజన్‌ బెడ్లు మే  17 నాటికి 433 మాత్రమే ఖాళీగా ఉంటే.. ప్రస్తుతం 7,270 పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపిన అధికారులు.

జనరల్‌ బెడ్స్‌ మే 19న 9,378 ఖాళీలు ఉంటే.. ప్రస్తుతం 11,708 ఖాళీగా ఉన్నాయన్న అధికారులు.


*తగ్గుతున్న కేసులు:*

7 వారాల డేటాను పరిశీలిస్తే అన్ని జిల్లాల్లో తగ్గిన కేసులు

కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ తగ్గిన రోగులు, ప్రస్తుతం 14,057 మంది మాత్రమే.

104 కాల్‌ సెంటర్‌కు 3,645 కు తగ్గిన కాల్స్, ఇదే 104 కాల్‌ సెంటర్‌కు మే 4న 19,175 కాల్స్‌ వచ్చాయి.


*ఆస్పత్రులు–బెడ్లు:*

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 557 కోవిడ్‌ ఆస్పత్రులలో 45,324 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో 25,220 బెడ్లు ఆక్యుపైడ్‌గా ఉన్నాయి.

ఆక్యుపైడ్‌ బెడ్లలో 20,073 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.

ఇక హోం ఐసొలేషన్‌లో 1,04,518 మంది ఉన్నారని అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు.


*కోవిడ్‌ కేర్‌ సెంటర్లు:*

రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబరులో 16 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు (సీసీసీ) ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 135కి చేరింది.

అలాగే బెడ్ల సంఖ్య కూడా 50,513 నుంచి 53,631కి పెరిగింది.

ప్రస్తుతం సీసీసీల్లో 14,057 మంది చికిత్స పొందుతున్నారు.


*వాక్సినేషన్‌:*

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 51,03,821 మందికి తొలి డోస్, 25,47,784 మందికి రెండు డోస్‌ల కోవిడ్‌ వాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నెలకు సంబంధించి కేంద్రం మొత్తం 36,94,210 వాక్సిన్లు కేటాయించగా, ఇప్పటి వరకు 5,08,710 పంపిణీ చేసిందని అధికారులు తెలిపారు.

ఇంకా ప్రభుత్వ పరంగా ఈ నెలలో 20,74,730 వాక్సిన్లు సేకరించాలని నిర్ణయించామని అధికారులు చెప్పారు.


*ఇంకా*

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 1187  ఉన్నాయని తెలిపిన అధికారులు.

నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మొత్తం 89 విజిలెన్సు కేసులు. 66 ఆస్పత్రులపై రూ.9.9 కోట్లు పెనాల్టీ విధించగా, నాన్‌ ఆస్పత్రుల కేసులు 23 ఉన్నాయి.

కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన 93 మంది పిల్లలను గుర్తించగా వారిలో 46 మందికి రూ.10 లక్షల సహాయం డిపాజిట్‌ చేయడం జరిగింది.


డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర ,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములుతో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.