జిల్లాలో పూర్తి స్థాయిలో కోవిడ్ కట్టడికి ఐదు కమిటీలు

 జిల్లాలో పూర్తి స్థాయిలో కోవిడ్ కట్టడికి  ఐదు కమిటీలు


*థర్డ్ వేవ్ ప్రిపరేషన్స్ ,100% వ్యాక్సినేషన్, శాంపిల్ సేకరణ, టెస్టింగ్ పెంపుదల, పోస్ట్ కోవిడ్ 19 హెల్త్ మేనేజ్మెంట్ ,యాక్షన్ ఫర్ అన్ లాక్  అంశాలపై కమిటీలు*


*ఆయా కమిటీలు రేపటికల్లా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి*


 *జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్*



కర్నూలు, జూన్ 6 (ప్రజా అమరావతి): జిల్లాలో కోవిడ్ ను  పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐదు  జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ,డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి,  కర్నూల్  మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, , డి ఆర్ ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఎమ్ హెచ్ ఓ రామగిడ్డయ్య, డిఆర్డీఏ పిడి వెంకటేశులతో పాటు ఈ  ఐదు కమిటీల సభ్యులతో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ థర్డ్ వేవ్ ప్రిపరేషన్స్, వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్, శాంపిల్ సేకరణ,టెస్టింగ్ పెంపుదల,  పోస్ట్ కోవిడ్ 19 హెల్త్ మేనేజ్మెంట్, యాక్షన్ ఫర్  అన్ లాక్ అనే అంశాలపై ఐదు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు..


థర్డ్ వేవ్ ప్రిపరేషన్స్ కమిటీ సంబంధించి  మూడవ  దశను ఎదుర్కునేందుకు ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది , టెస్టింగ్ , వ్యాక్సినేషన్ , మెడికల్  ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంపు,  ట్రీట్మెంట్, ప్రివెన్షన్ అవగాహన కార్యక్రమాల రూపకల్పన ఏ విధంగా చేయాలో చర్చించాలన్నారు. అలాగే మూడో దశలో చిన్న పిల్లలపై  ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకునేందుకు ఐసిడిఎస్ పిడి డిఆర్డిఏ పిడి తదితరులను కమిటీలో వే శామన్నారు..


100% వ్యాక్సినేషన్ కమిటీ అర్హులైన వారందరికీ100% వాక్సినేషన్ వేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ,45 ఏళ్లు నిండిన వారందరికీ 100% వ్యాక్సినేషన్ కవర్ చేసే విధంగా ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 51% ఫస్ట్ డోస్ వేశామన్నారు ,ఇరవై ఒక్క శాతం మందికి రెండో వేశామన్నారు ,49 శాతం మందికి ఫస్ట్ డోస్, 79 శాతం మందికి రెండవ డోసు వేయాల్సిఉందన్నారు .మూడో దశ నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని కలెక్టర్  అభిప్రాయపడ్డారు . మన వద్ద లభ్యంగా ఉన్న వ్యాక్సిన్తో అవసరమైన వారందరికీ వ్యాక్సిన్ వేసే విధంగా ప్లాన్ చేయాలన్నారు.


శాంపిల్ కలెక్షన్ టెస్టింగ్ కమిటీ ప్రతిరోజు ఖచ్చితంగా 8000 టెస్టులు జరిగేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ శాంపిల్ కలెక్షన్ తక్కువగా ఉండటం వల్ల టెస్టులు చేయలేకపోతున్నామన్నారు ..ఎక్కువ టెస్టులు చేస్తేనే ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులను గుర్తించగలమని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని  కలెక్టర్ అన్నారు. తద్వారా పాజిటివిటీ, మరణాల శాతం తగ్గుతాయన్నారు. కేసులు తగ్గాయని , నిర్లక్ష్యం పనికి రాదన్నారు.. కమిటీ సభ్యులు ఈ అంశంపై చర్చించి పదివేల శాంపిల్స్  సేకరించి, రోజుకు ఎనిమిది వేల టెస్టులు జరిగేలా చూడాలన్నారు. ఫలితాలను కూడా వెంటనే ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.


పోస్ట్ కోవిడ్ హెల్త్ మేనేజ్మెంట్ కమిటీ కోవిడ్ తరువాత వచ్చే పరిణామాలను  విశ్లేషించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు . బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఇతర అనారోగ్యాలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించి ప్రణాళికలు రూపొందించాలన్నారు.


యాక్షన్ ఫర్ అన్లాక్ కమిటీ అన్లాక్ తర్వాత ఏ రకంగా చేస్తే బాగుంటుంది  సూచనలు ఇవ్వాల ని, వీటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపుతామన్నారు.


ఐదు కమిటీలు  సభ్యులతో రేపు ఉదయం అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆయా అంశాలపై చర్చించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. రేపు మధ్యాహ్నం వి సి లో ఈ యాక్షన్ ప్లాన్ల పై చర్చించి జిల్లాలో   కోవిడ్ను పూర్తి స్థాయిలో  కట్టడి చేసేందుకు  ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.



Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image