కార్మిక శాఖ లోని పలు డిపార్ట్మెంట్ లు పై సమీక్షా సమావేశాలు నిర్వహించిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు

 


అమరావతి (ప్రజా అమరావతి);


కార్మిక శాఖ లోని పలు డిపార్ట్మెంట్ లు పై సమీక్షా సమావేశాలు నిర్వహించిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు ఈ సమీక్షాలో పలు అంశాలపై చర్చించిన మంత్రి గారు


కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాములు తో సమీక్షాలు నిర్వహించిన మంత్రి గుమ్మనూరు


ఈ రోజు మంత్రి ఛాంబర్ లోని  IMS డెరైక్టర్ డా" యస్.బి.ఆర్ కుమార్(IRS), మంత్రి గారు మాట్లాడుతూ గత రెండు, మూడు రోజులు నుంచి వివిధ ప్రతికలో ESI లో జరిగిన అవకతవకలు పై వార్తలు పై డెరైక్టర్ తో మంత్రి గారు చర్చించినారు.


ఈ అవకతవకలు ఘటనపై కమిటి రిపోర్టు రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని డెరైక్టర్ ను మంత్రి గారు ఆదేశించారు.


నివేదిక ఆధారంగా ఈ ఘటనకు బాధ్యలైన వారిపై తగు చర్యలు తీసుకుంటాని మంత్రి గారు తెలిపారు.


ESI డిస్పెన్సరీ మందులు లభ్యత మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు.


ప్రత్యేక లెబర్ కమిషనర్ జి.రేఖారాణి(IAS)తో సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా లెబర్ కమిషనర్ తో మంత్రి గారు మాట్లాడుతూ లెబర్ CESS కలెక్షన్ మీద వివరాలు అడిగి మంత్రి గారు తెలుసుకున్నారు.


బాయిలర్ల డైరెక్టర్ ఉమ మహేశ్వర్ రావు తో మంత్రి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.


ప్రమాదాలు జరగకుండా సరైన సమయాల్లో ఎప్పటికప్పుడు బాయిలర్ల పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని మంత్రి గారు ఆదేశించారు.


ఇటీవలే గుంటూరు వ్యవసాయ క్షేత్రములో బాయిలర్ జరిగిన ఘటన పై మంత్రి గారు ఆరా తీసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు.