నారాయణ, అపోలో, ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ని ప్రారంభించారు.నెల్లూరు (ప్రజా అమరావతి);


నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి హై స్కూలులో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, మున్సిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్ పర్యటించి.., నారాయణ, అపోలో, ప్రైవేటు ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., 0-5 ఏళ్ల లోపు చిన్నారుల తల్లులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించే కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు. 3 లక్షల 80 వేల మంది చిన్నారుల తల్లులను గుర్తించామని, వారందరూ తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. విదేశీ విద్యకోసం విదేశాలకు వెల్లే విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేశామని.., జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 40 వేల మందికి వ్యాక్సిన్ అందించామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో నగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ సెంటర్లలో 18 ఏళ్లు దాటిన వారు సైతం వ్యాక్సిన్ తీసుకోవచ్చని.., కోవిన్ సైట్ లో పేరు నమోదు చేసుకుని, వ్యాక్సినేషన్ సెంటర్లకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 


ఈ కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.