ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలి*ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలి


*


*పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను సత్వరమే పరిష్కరించాలి* 


*కేసులను  త్వరితగతిన  విచారించి, బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి* 


*నష్ట పరిహారం వెంటనే  అందేలా చర్యలు చేపట్టండి* 


*2016 - 21 వరకు రూ.15.20 కోట్ల  నష్ట పరిహారం చెల్లింపు*


*జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ  సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్* 


కర్నూలు, జూన్ 11 (ప్రజా అమరావతి) :-

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్  సంబంధిత అధికారులను ఆదేశించారు. 


శుక్రవారం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్  అధ్యక్షతన నిర్వహించిన  ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ నిరోధక చట్టం అమలు తీరుపై  జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం చర్చించింది...


జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ్ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రమాదేవి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఈ.కిరణ్ కుమార్, మమతా రెడ్డి, రవికుమార్, రమేష్ బాబు, డీఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ యస్.సి, యస్.టి అట్రాసిటి కేసుల పై ప్రత్యేకంగా సమీక్షించి,  ఇప్పటి దాకా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతో పాటు బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందేలా చూడాలని  జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను   ఆదేశించారు. 

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో  విచారణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.   నిబంధనల మేరకు చార్జిషీట్ స్థాయికి తీసుకువచ్చేలా  సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు..


 2011 నుంచి కూడా  కొన్ని కేసులు  పెండింగ్లో ఉన్నాయని, వాటికి  వెంటనే చార్జిషీట్ ఫైల్ చేయాలన్నారు...2016 నుంచి జడ్జిమెంట్ వరకు పెద్దగా  రాలేదని,  ఆ దిశగా  తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. 2016 - 2021 వరకు 1817 కేసులు ప నమోదు కాగా అందులో 868 కేసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినందువల్ల రూ.  5.11కోట్లు  రిలీఫ్ మంజూరు చేయడం జరిగిందన్నారు..  403 కేసులకు చార్జిషీట్ నమోదు కాగా, చార్జిషీట్ ప్రకారం బాధితులకు  రూ.10.09 కోట్లు మొత్తం రూ.15.20 కోట్ల  మొత్తం  నష్ట పరిహారం అందించడం జరిగిందన్నారు.  బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా కేసుల విచారణ వేగవంతం కావాలన్నారు..ఆర్డీవోలు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు..


  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కేసుల ఫైలింగ్, ఏ దశలో ఉన్నాయి, నష్టపరిహారం చెల్లింపు అన్ని వివరాలతో  అన్ని శాఖలు ఒకే ఫార్మాట్ లో వారం లోపు తనకు నివేదిక పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. 


 ఎస్సీ, ఎస్టీ బాధితులకు సమస్య వస్తే అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.  డి వి ఎం సి మీటింగ్ లో సభ్యులు తెలియజేసిన సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలన్నారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగినా,  ఇబ్బందులు ఎదురైనా వారి దృష్టికి వచ్చిన వెంటనే  పోలీస్, రెవెన్యూ అధికారులు సంఘటన జరిగిన ప్రదేశాలకు చేరుకొని  జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి విచారణ మొదలు పెట్టాలన్నారు. డి వి ఎం సి సభ్యులు, ప్రజా సంఘాలు, మీడియా వాళ్లు ఎవరైనా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి అన్యాయాలు జరుగుతున్నాయిని  అధికారులకు తెలియజేస్తే వెంటనే అధికారులు స్పందించాలన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు  ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పనులు, బ్యాక్ లాగ్ vacancies, చదువులు ఈ అంశం అయినా వాటి పరిష్కారానికి కూడా కృషి చేయాలన్నారు..గ్రామాల్లో ప్రతి నెల సివిల్ రైట్స్ డే ను జరపాలన్నారు.. ఎస్సీ, ఎస్టీ లకు న్యాయం జరిగేలా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు ఆదేశించారు. ప్రతి నెల ఒకసారి మీటింగ్ పెట్టుకొని డివీఎంసీ సభ్యులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని డిఆర్ ఓ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 


 జిల్లా ఎస్పీ డాక్టర్ కె. ఫక్కీరప్ప  మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి

గత సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకున్నామన్నారు. చాలా వరకు బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా  ఛార్జిషీట్ ఫైల్ చేయడం జరిగిందన్నారు.. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టాలని డీఎస్పీ లకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. 


గత డి వి ఎం సి సమావేశంలో డి వీ ఎం సి సభ్యులు తెలియజేసిన 69 అర్జీలు సంబంధించి 51 అర్జీ లకు సంబంధించి పరిష్కారమయ్యాయిని, మిగిలి ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు డి ఆర్ ఓ తెలిపారు.. 


 జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఈ.కిరణ్ కుమార్, మమతా రెడ్డి, రవికుమార్ లు జిల్లా అధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని  కోరారు.Comments