మంత్రి కొడాలి నానికి సుంకర కృతజ్ఞతలు- కొనసాగించడం పట్ల మంత్రి కొడాలి నానికి సుంకర కృతజ్ఞతలు 


- గుడివాడ, జూన్ 11(ప్రజా అమరావతి)


: గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం ఇలపర్రు పీఏసీఎస్ చైర్ పర్సన్ గా సుంకర వెంకటరమణను కొనసాగించడం పట్ల రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గుడివాడ పట్టణంలోని కోఆపరేటివ్ డీఆర్ కార్యాలయంలో సుంకర వెంకటరమణకు కొనసాగింపు ఉత్తర్వులను డీఆర్ డీ విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా సుంకర మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని సహకారంతో ఇలపర్రు పీఏసీఎస్ ను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళామని చెప్పారు. పీఏసీఎస్ ద్వారా సంఘ సభ్యులకు మెరుగైన సేవలందిస్తానని తెలిపారు. తనను చైర్‌పర్సన్‌గా కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన కొనసాగింపునకు సహకరించిన మంత్రి కొడాలి నాని, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషలకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా సుంకరను కొనసాగించడం పట్ల పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం నేత టీపీఎస్ హనుమంతరావు, ఇలపర్రు పీఏసీఎస్ సభ్యులు అభినందనలు తెలిపారు.

Comments