పనితీరు మెరుగు పరచుకోకపోతే చర్యలు తప్పవు


*మనబడి నాడు-నేడు కు సంబంధించిన అన్ని పనులను ఈ నెలాఖరు లోపు జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలి:-*


*పనితీరు మెరుగు పరచుకోకపోతే చర్యలు తప్పవు


:-*


*మనబడి నాడు-నేడు పనులలో కర్నూలు జిల్లా అగ్ర స్థానంలో ఉండాలి :-* 


*మనబడి నాడు-నేడు పనుల పురోగతి పై టెలీ కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ :-*


కర్నూలు, జూన్ 17 (ప్రజా అమరావతి) :


మన బడి నాడు-నేడు అన్ని పనులను ముమ్మరం చేసి ఈ నెలాఖరు లోపు  వంద శాతం పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.


గురువారం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మన బడి నాడు నేడు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు , డిప్యూటీ డిఈఓలు, ఈఈలు, డిఈ లు, మండల విద్యా శాఖ అధికారులు,  ఏఈలు, సెక్టోరియల్ అధికారులతో  సమీక్షను నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి  పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు తీర్చిదిద్దడానికి అధిక నిధులు కేటాయించారన్నారు.  ఈ అంశానికి అధిక ప్రాధాన్యత వున్నందున సీఎం స్థాయిలో సమీక్షలు జరుపుతున్నారన్నారు.. కొంతమంది అధికారులు మనబడి నాడు-నేడు పనులను ఎలాంటి బాధ్యత లేకుండా ప్రభుత్వ పనులు కదా అని  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నిర్దేశించిన గడువులోగా  వంద శాతం పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు సేవ చేసే అవకాశం వచ్చిందని, మన పాఠశాల అనుకొని పాఠశాలలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. చాలామంది నాడు నేడు పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని చేసిన పనులకు ఎప్పటికప్పుడు ఎక్స్పెండిచర్ బుక్, బిల్స్ అప్లోడ్ వెంటనే చేయాలన్నారు. మన బడి నాడు-నేడు పనులలో కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా పనులు పూర్తి చేయాలన్నారు. మనబడి నాడు-నేడు స్టేటస్ ఆఫ్ స్కూల్స్ లో ఫేజ్ 1 -1080, నాబార్డ్ 43, స్కూల్ ప్రాజెక్ట్ పూర్తి 137, స్టేటస్ వర్క్ లో కర్నూలు జిల్లాలో మొత్తం స్కూలు 7768, పనులు పూర్తి అయినవి 6713, ఎక్స్పెండిచర్ లో 88.06 శాతం కలదు. స్టేటస్ వర్క్ లో Maud 97.38%, సమగ్ర శిక్ష 90.99 శాతం, Apewidc 90.75 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 88.08 శాతం, పంచాయతీ రాజ్ 81.92 శాతం పనులు పూర్తయ్యాయని, తక్కువ సమయం ఉందని, వంద శాతం పనులు పూర్తయ్యేలా ఐదు డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.


అంతకు ముందు జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం)  మనబడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న పనుల పై  సుదీర్ఘంగా మండల వారీగా సమీక్షించారు.


ఈ సమీక్షలో డి ఈ ఓ సాయి రామ్, సర్వ శిక్ష అభియాన్ పిఓ వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డిఈ ఓలు, ఈఈ లు, డిఈలు, మండల విద్యా శాఖ అధికారులు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.