ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ రెండేళ్ళలోనే చేసి చూపించారని ప‌లువురు మేధావులు, విద్యావేత్త‌లు ప్రశంసించారు

   అమరావతి (ప్రజా అమరావతి);           ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను చాలా ప్రభుత్వాలు పూర్తి కాలం పరిపాలించినా కూడా సాధించలేనంత ప్రగతిని ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ రెండేళ్ళలోనే చేసి చూపించారని ప‌లువురు మేధావులు, విద్యావేత్త‌లు ప్రశంసించారు


. సమగ్రాభివృద్ధి సాధనలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందంటేనే ముఖ్యమంత్రిగా జగన్‌ కార్యదక్షత ఏపాటిదో ఎవరైనా ఇట్టే అర్ధం చేసుకోవచ్చన్నారు. కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించే విధంగా జగన్‌ ముందుకు సాగుతున్నారని అభినందించారు. బుధ‌వారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ''అభివృద్ధి పధంలో ఆంధ్రప్రదేశ్‌'' అనే అంశంపై జరిగిన వెబినార్‌లో, గడచిన రెండేళ్ళ కాలంలో ముఖ్యమంత్రిగా శ్రీ వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి పథ‌కాలు, సంక్షేమ కార్యక్రమాలపై  వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా తమ విలువైన అభిప్రాయాలను తెలియ‌జేశారు. ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి ఈ వెబినార్ కు సమన్వయకర్తగా వ్యవహరించారు.*


*సమన్వయకర్త ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,* రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మేధావులుగా తామంతా దాని పనితీరుపై నిశిత పరిశీలన చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తామని వెల్లడించారు. అందులో భాగంగానే ప్రస్తుతం రెండేళ్ళ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు.


*ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ గురుమూర్తి మాట్లాడుతూ,* ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి పేదవాడి చెంతకీ తన పథ‌కాలు చేరాలనే తపనతోనే గడచిన రెండేళ్ళు కృషి చేసినట్లు చెప్పారు. విద్య–వైద్యంపై ప్రధానంగా దృష్టి 

కేంద్రీకరించి అందరికీ కార్పొరేట్‌ తరహా సేవలు అందుబాటులోకి తెచ్చారన్నారు. అవినీతికి తావు లేకుండా ఉన్న 

కొద్దిపాటి ఆర్ధిక వనరులతోనే అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. ఓవైపు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే 

మరోవైపు ఇన్ని ప్రజోపయోగ పథ‌కాలు ప్రవేశపెట్టడం చిన్న విషయం కాదని గురుమూర్తి అభిప్రాయపడ్డారు.

*రాజీవ్‌గాంధీ నాలెడ్జి టెక్నాలజీ యూనివర్సిటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి మాట్లాడుతూ,* గడచిన రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో సాధించినంత ప్రగతి మరే ఇతర రాష్ట్రంలో చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. విద్యావ్యవస్థను సమూలంగా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్‌ నిబద్ధతతో పనిచేయడం వలన నేడు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమైనట్లు చెప్పారు. విశ్వవిద్యాలయాలను కూడా సమూలంగా మార్చి యువతకు ఉపాధి ఉద్యోగాలు వెంటనే లభ్యమయ్యేలా ప్రణాళికలు రూపొందించడం అభినందించదగ్గ అంశమన్నారు. ఇలా ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ప్రభుత్వ పనికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.


*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ,* రాష్ట్ర ప్రభుత్వం గడచిన రెండేళ్ళలోనే రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్‌ ఒకరిగా నిలిచారని కితాబిచ్చారు. ప్రధానంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రిగా జగన్‌ దేశంలోనే గుర్తింపు పొందారని పేర్కొన్నారు.


*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజి వైస్‌ ఛాన్సలర్‌ శ్రీ బాల మోహన్ దాస్ మాట్లాడుతూ,* శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏడాది కరోనాతోనే గడిచినా కూడా ఎన్నికల మేనిఫెస్టో లో 94.5 శాతం హామీలను నెరవేర్చారని అన్నారు. ఈ రెండేళ్లలో కూడా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ రూపురేఖలు సమూలంగా మార్చేలా శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అమ్మఒడి పథ‌కం ద్వారా ఎంతోమంది తల్లులు తమ పిల్లలను స్కూల్‌ కు పంపగలం అనే భరోసా కలిగిందన్నారు. ప్రతి పిల్లవాడు వారి ఆర్ధిక‌ స్దితిగతులతో సంబంధం లేకుండా మంచి యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్‌ అందించడమే కాక పౌష్టికాహారం కూడా అందిస్తుండటంతో మంచి మౌళికవసతులతో కూడిన ప్రభుత్వ స్కూల్స్‌ తో చేరుతున్నారని అన్నారు. ఉన్నత విద్యలో ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. పాలకమండళ్లలో విద్యావేత్తల సంఖ్య పెంచడంతోపాటు వైస్‌ ఛాన్సలర్ల కాలపరిమితి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.


*విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి శ్రీమతి అనిత మాట్లాడుతూ,* కరోనా వంటి విపత్కర పరిస్దితులలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. అయితే  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాల వల్ల ఇతర వర్గాలతోపాటు ఆర్ధిక‌ ఇబ్బందులు ఎదుర్కొనే పేదవర్గాలు నిశ్చింతగా ఉండగలిగాయని అన్నారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు వృత్తి విద్యకళాశాలలు స్ధాపించటం జగన్‌ గారి దార్శినికతకు నిదర్శనమని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్దానికతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రానున్న రోజులలో నిరుద్యోగం రాష్ట్రం నుంచి పారిపోతుందని తెలియచేశారు.


*ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సిధ్దయ్య గారు మాట్లాడుతూ,* జాతీయ విద్యావిధానం అమలుచేస్తున్న మొదటి రాష్ట్రం మనదేనని అన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమపధకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే నని తెలియచేశారు.


*ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌  ఎ.ప్రమీళా రాణి మాట్లాడుతూ,* సమాజంలోని అన్ని వర్గాలను దృష్టిలోపెట్టుకుని నవరత్నాలను రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ లో సింహభాగం సంక్షేమ పథ‌కాలకే కేటాయిస్తూ ఏపిని సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. పేదవాడు నిశ్చింతగా బతికేలా ఈ పథ‌కాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.


కార్యక్రమంలో ఆచార్యనాగార్జున యూనివర్శిటీ రిజిష్ట్రార్ కె.రోశయ్య, ఆంగ్లశాఖ ఉపాధ్యాయుడు జి.ఇన్నారెడ్డి, ఆంగ్లశాఖ అధ్యాపకురాలు కరుణ, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడు వలి గారు, విశ్వవిద్యాలయ రెక్టార్‌ వరప్రసాదమూర్తి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments