మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి మౌళిక వసతుల కల్పనపై కలెక్టర్ సమీక్ష

 మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి మౌళిక వసతుల కల్పనపై కలెక్టర్ సమీక్ష

మంగళగిరి (ప్రజా అమరావతి);


మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ది, మౌళిక వసతుల కల్పనపై గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బుధవారం 

అధికారులతో ఎయిమ్స్ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ సంస్ద ఎయిమ్స్ పనులు  95 శాతం పూర్తయ్యాయి.


ఎయిమ్స్  భవన నిర్మాణపు పనులు  98 శాతం  పూర్తయ్యాయి.


జాతీయ రహధారి ( వడ్డేశ్వరం) నుండి ఎయిమ్స్ కు ప్రధాన మార్గం పనులు 88 శాతం పూర్తి . 


రోడ్డు విస్తరణకు ఆటవీ శాఖకు సంబంధించి 0.425 ఎకరా భూమి అవసరం కానుంది.


 ఇరు వైపుల 15 మీటర్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి  ( పెంచాల్సి) వుంటుంది.

 

ఎయిమ్స్ అభివృద్దికి సంబంధించి రోడ్ల నిర్మాణం నిమిత్తం కావాల్సిన ఆటవీ భూమికి ఆటవీ శాఖ అధికారులు త్వరితిగతిన ఎన్ వో సిలు మంజూరు చేసేలా చూడాలని, దానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచన. 


భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి.

 

తాడేపల్లి, మంగళగిరి లో చెత్త డంప్పింగ్ కు స్దలం సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన ఎంటిఎంసి కమిషనర్ నిరంజన్ రెడ్డి


సీఆర్డీఏ పరిధిలో శాఖమూరులో డంప్పింగ్ యార్డుకు కేటాయించిన భూమిని సద్వినియోగం చేసుకునే విధంగా ఒక్కసారి పరిశీలన చేయాలని కలెక్టర్ సూచన 


రానున్నకాలంలో 5 ఎంఎల్డీ నీరు అవసరం అవుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన ఎయిమ్స్ ప్రతినిధులు

 

ఎయిమ్స్ మంచినీటి ప్రాజెక్ట్ నిమిత్తం 10 కోట్ల తో ప్రతిపాదనలు .. 


బకింగ్ హమ్ కాలువ నుండి నేరుగా ఎయిమ్స్ కు మడ్డినీరు  సరఫరపై సమాలోచన..


మంగళగిరి కృష్ణా వాటర్ ప్రాజెక్ట్ 10 ఎంఎల్ డి కెపాసిటీ కాగా, పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని , 

తాత్కలికంగా ఎయిమ్స్ కు అవసరత నిమిత్తం వాటర్ ట్యాంకర్ ల ద్వార నీటిని సరఫర చేస్తున్నామని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 


జాతీయ రహదారి నుండి ఎయిమ్స్ ప్రధాన మార్గం పరిశీలించిన కలెక్టర్ , అధికారులు 


కార్యక్రమంలో  పాల్గోన్న రెవెన్యూ, ఎపిఎస్పీ, ఎన్డీఆర్ఎఫ్, ఆటవీ శాఖ, కార్పొరేషన్ , ఎయిమ్స్ అధికారులు.