, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం శ్రీ జగన్ ను గుండెల్లో పెట్టుకున్నారుః జోగి రమేష్

 

తాడేపల్లి- వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం (ప్రజా అమరావతి);


*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం శ్రీ జగన్ ను గుండెల్లో పెట్టుకున్నారుః జోగి రమేష్


*


*వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి శ్రీ జోగి రమేష్‌ ప్రెస్ మీట్ పాయింట్స్..*


*- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మబంధువు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.*

*- ఇది బలహీనవర్గాల మేలుకోరే ప్రభుత్వం.. బలమైన ప్రభుత్వం.*

*- చంద్రబాబు నాయుడు రాష్ట్రం పాలిట శిఖండిలా మారాడు.*

*- నవశకానికి నాంది.. జనమంతా శ్రీ జగన్ వెంటే..*

*- 31 లక్షల ఇళ్ళు.. ఒక కోటీ ఇరవై లక్షల మంది పేద కుటుంబాలకు గూడు కల్పిస్తున్న మహనీయుడు శ్రీ జగన్‌*

*- చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి.. ఈసారి కుప్పంలో కూడా ఓడిపోతారు.*

*- మనసున్న ప్రభుత్వం కాబట్టే, నీతి ఆయోగ్‌ ర్యాంక్‌ల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది.*


*జోగి రమేష్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..*


1. నవరత్నాల్లో భాగంగా  31 లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఈరోజు సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌. ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా చూశారా..?


2. పక్కా ఇళ్ళ నిర్మాణం తొలివిడతలో భాగంగా 15 లక్షల 60వేల మందికి ఇళ్లు కట్టించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినరోజు.  ఇది నవశకానికి నాంది పలికిన రోజు. వాళ్ల పేరుమీదే రిజిస్ట్రేషన్లతో ఇళ్ల పట్టాతో పాటు ఇళ్లు కట్టించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. మొత్తం 51వేల కోట్ల రూపాయలతో 17 వేలకు పైగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణం జరగుతోంది. అంటే రాష్ట్రంలో జరుగుతుంది ఇళ్ళ నిర్మాణం కాదు.. ఏకంగా ఊళ్ళ నిర్మాణమే. 


3. కలలో కూడా ఊహించని దాన్ని జగనన్న సాకారం చేయబోతున్నారని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 80 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అక్కచెల్లెమ్మలకు సొంత ఇంటిని నిర్మాణం చేసి ఇస్తున్న శ్రీ జగన్‌ ను ... వాళ్లు గుండెల్లో పెట్టుకుంటున్నారు. 


4. 30 లక్షలకు పైగా ఇళ్ళు అంటే.. ఒక కోటీ ఇరవై లక్షల మంది పేద కుటుంబాలకు గూడు కల్పిస్తున్న మహనీయుడు వైఎస్‌ జగన్‌ గారు. ఇంతమంచి పని చేస్తుంటే .. వాటికి అడ్డంకులు సృష్టిస్తూ ఎల్లో మీడియా ద్వారా చిలవలు పలవలుగా అబద్ధాలు, అసత్యాలు  ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రం పాలిట శిఖండిగా మారాడు.


5. రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ వెంట అడుగులు వేస్తున్నారు. రెండేళ్ళలో జరిగిన అన్ని ఎన్నికల్లో జనమంతా వైఎస్సార్‌ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించారు.


6. మనసున్న మంచి మనిషి కాబట్టే ..దళారులు, మధ్యవర్తులు లేకుండా కామన్‌ మెన్‌ అకౌంట్‌కు డబ్బులు వెళుతున్నాయి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇలాంటి మంచిపని జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మబంధువు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. 


7. మా బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు పక్కా ఇళ్లు కడుతుంటే టీడీపీ నేతలు మధనపడి, దిగులుపడి పోతున్నారు. చంద్రబాబు కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారు. ఎల్లో, సోషల్‌ మీడియాలో ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో జగన్ గారి ముద్రను ఒక్క శాతం కూడా తగ్గించలేరు. శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రజల పక్షపాతి. 


8.  40 ఏళ్ళ ఇండస్ట్రీ, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి చేయలేకపోయింది జగన్ మోహన్ రెడ్డిగారు చేసి చూపిస్తుంటే.. పోలవరం పూర్తి కాలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు కరోనా కష్టకాలంలోనూ.. ప్రాజెక్ట్‌ పనులు పూర్తవుతున్నాయి, వైఎస్‌ జగన్‌ గారి హయంలోనే పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవుతుంది.


9. ఎవరైనా పేదల పక్షాన నిలబడినప్పుడే నాయకుడు అవుతాడు. ఆయనే జగన్‌మోహన్‌రెడ్డి. పేదలకు వ్యతిరేకపక్షంగా నిలబడ్డ చంద్రబాబు ఎప్పటికీ ప్రజా నాయకుడు అనిపించుకోలేడు.


10. చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి. ఎన్నికలు పెడితే గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ఆయన, ఈసారి కుప్పంలో కూడా ఓడిపోతారు.


11. ప్రజలంతా నూటికి నూరు శాతం జగన్‌మోహన్‌ రెడ్డి గారి బాటలో నడుస్తామని తీర్మానం చేసుకున్నారు. ఇది బలహీనవర్గాల మేలు కోరే ప్రభుత్వం. బలమైన ప్రభుత్వం. 


12. చంద్రబాబు నాయుడు అరిచి గీపెట్టినా, ఈ రాష్ట్రంలో మరో 25 సంవత్సరాల పాటు జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇది శిలా శాసనం.


13. స్థిర ఆర్థిక అభివృద్ధిలో నీతి ఆయోగ్‌ ఇచ్చిన ర్యాంక్‌ల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది.  పరిపాలన, ప్రభుత్వం అంటే మనసు పెట్టి... కోట్లాది మంది గడపకు చేర్చారు కాబట్టే నీతి ఆయోగ్‌ మూడో ర్యాంక్‌ ఇచ్చింది. పేద ప్రజల ఆత్మబంధువుగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు.


14. శ్రీ వైఎస్‌ జగన్‌ మాట చెబితే ఆ మాట నెరవేర్చేటందుకు ఎంతవరకైనా వెళతారు. మనసుపెట్టి ఇళ్లు కట్టి చూపించి ప్రజల చేత జేజేలు కొట్టించుకుంటారు.

- చంద్రబాబు ప్రెస్‌మీట్ లు, జూమ్‌ మీటింగ్‌లకే పరిమితం. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్‌కే పరిమితం. ఆయనకు రాష్ట్రంలో స్థానం లేదు, ఉండదు కూడా.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image