మొన్న ఆదేశం..నేడు ఆచరణ

 Date Revised




శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


మొన్న ఆదేశం..నేడు ఆచరణ



సోమశిల ప్రాజెక్టు.. యావత్ నెల్లూరు భవిష్యత్తు: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి



సోమశిల ప్రాజెక్టు పనులను పరుగులెత్తించేందుకు "త్రిసభ్య కమిటీ" ఏర్పాటు చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


ఫేజ్-1,2లలో భూసేకరణ సమస్య సహా ప్రాజెక్టు చుట్టూ ముడిపడి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించేలా ఎప్పటికప్పుడు పనిచేయనున్న ముగ్గురు సభ్యుల కమిటీ*


నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.నాగేంద్ర, నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రావు సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు.


సోమశిల పనుల్లో వేగం.. ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయనున్న 'సోమశిల త్రిసభ్య కమిటీ'.


త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు.


ఇవాళ కమిటీ సభ్యులతో తొలి సమావేశం  నిర్వహించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


సోమశిల, కండలేరు, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అమలు, ఫేజ్-2 పనులు, దక్షిణ కాలువ విస్తరణ, అటవీశాఖ నిబంధనల అమలు వంటి పనులను ఎలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలో దిశానిర్దేశం చేసిన మంత్రి మేకపాటి.


ప్రతి వారం త్రిసభ్య కమిటీ సమావేశమై ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని ఆదేశించిన మంత్రి మేకపాటి.


సమయాన్ని నిర్దేశించుకుని ఎప్పటికప్పుడు తనకు పురోగతి చూపించాలని జాయింట్ కలెక్టర్ ని ఆదేశించిన మంత్రి గౌతమ్ రెడ్డి.


రెండు రోజుల సమయం ఇస్తే సోమశిల ప్రాజెక్టు పూర్తికి  చేపట్టవలసిన చర్యలు ప్రణాళిక కార్యాచరణను సిద్ధం చేస్తామని మంత్రి మేకపాటికి తెలిపిన జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్.


ప్రజల ఆశలను నెరవేర్చే బాధ్యత మీదేనని మంత్రి వ్యాఖ్య.


ప్రాజెక్టు పూర్తికి అవసరమైన చర్యలను తీసుకోవడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా : మంత్రి మేకపాటి.



నెలల కాలంలోనే ప్రాజెక్టును పూర్తిచేసి చూపించాలని వెల్లడించిన మంత్రి మేకపాటి.



ఈ  సమావేశానికి హాజరైన జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్,నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రావు, జిల్లా అటవీ శాఖ అధికారులు.