నిస్సహాయులకు ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది పోలీస్...


డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి);


నిస్సహాయులకు ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది పోలీస్...


  అటువంటి పోలీసుల నుంచి సామాన్యులకు మెరుగైన సేవలు అందాలి.. అలా అందాలంటే పోలీసుల పనితీరులో నాణ్యత పెరగాలి.. నేరాలు తగ్గాలంటే శిక్షలు పెరగాలి...నింధితులు తప్పించుకోకుండా ఉండాలంటే తగిన ఆధారాలు సమర్పించాలి.... మహిళలు ధైర్యంగా బయటకి రావాలంటే ఆకతాయిల మొదలుకొని మృగాళ్ళ వరకు అదుపు చేయాలంటే అందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిందే... మహిళలు చిన్నారులు సామాన్యులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేయాలంటే అందుకు సమర్ధవంతపైన వ్యవస్థ ను ఏర్పాటు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం దిశ అంకురార్పణకు శ్రీకారం చుట్టారు.

మహిళల పట్ల జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిశ సంభందిత  కార్యక్రమానికి కావల్సిన సదుపాయాల కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. అందుకు అనుగుణంగా కేసు నమోదు మొదలుకొని  దర్యాప్తులో కీలకమైన మూల స్తంభలైన ఫోరెన్సిక్, మెడికల్, ప్రాసిక్యూషన్, ట్రైల్, ప్రత్యేక న్యాయస్థానల అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది.అందులో భాగంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి గారు నూతనంగా 51 ఫోరెన్సిక్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ నియమకాలను కేటాయిచడం జరిగింది. ఈ నియామకాల ద్వారా వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు  సాధ్యమైనంత తొందరగా ఫోరెన్సిక్ నివేదికలు , DNA రిపోర్ట్స్ , నిర్ణీత సమయంలో  పోస్ట్ మార్టం ,అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్ పూర్తి చేసి చర్యలు తీసుకొని నిర్ణీత సమయంలో న్యాయస్థానాల్లో చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా నేరస్థులను ఖఠినంగా శిక్షించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది.     

 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వసతులతో కూడిన  దిశ పోలీస్ స్టేషన్ ల ప్రారంభం తో మహిళలకు, చిన్నారులకు బరోసా కల్పిస్తూ మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటికే దిశ మొబైల్ అప్లికేషన్, దిశ SOS, ప్రత్యేక న్యాయస్థానలు, DNA LABS , సైబర్ ల్యాబ్స్, దిశ పోలీస్ స్టేషన్ లో డి‌ఎస్‌పి స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు మహిళల కోసం  ప్రత్యేకంగా  సిబ్బంది, ప్రాధమిక చికిత్స కోసం వైద్యులు, దిశ సెంటర్స్, దిశ పెట్రోలింగ్, దిశ ఫోరెన్సిక్ మొబైల్ వాహనం, ప్రతి పోలీస్ స్టేషన్ లో  దిశ సైబర్ నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నేర పరిశోధనలో సాంకేతిక విజ్ఞానం, దాని వినియోగం పెంపొందించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన 51 ఫోరెన్సిక్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ నియమకాలను ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అత్యంత పారదర్శక విధానం ద్వారా 8300 మంది అభ్యర్డులకు  రాతపరీక్ష నిర్వహించగా మెరిట్ లిస్టు ఆధారంగా 51 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ శిక్షణ సంస్థ డైరెక్టర్ యన్ సంజయ్ IPS, ఎపి ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ సరీన్ పర్యవేక్షణ లో ఆరు నెలలపాటు  ఫోరెన్సిక్ సైన్స్ లో దేశంలోనే అత్యంత అనుభవం కలిగిన  నిపుణులు, సంస్థల నుండి  ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.


ఈ సంధర్భంగా ఎపి డి‌జి‌పి శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారు  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎఫ్ఎస్ఎల్ విభజించడంతో ఎపి ఎఫ్ఎస్ఎల్ లో మానవ వనరులు, ఇతర వనరుల కొరత ఏర్పడింది. దీనిపైన  గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎఫ్ఎస్ఎల్ లో మానవ వనరుల ఆవశ్యకతను గుర్తించి పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ అత్యంత  కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా  ఎఫ్ఎస్ఎల్ లో కీలకమైన 51 సైంటిఫిక్ అసిస్టెంట్ల నియామకానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఫోరెన్సిక్ సైన్స్ అనేది బహుళ ప్రయోజనాలున్న ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన విభాగం. సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక శిక్షణ పొందడం ద్వారా శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తో  నేరాల  పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా  రాష్ట్రంలోని మహిళలు,  పిల్లలు,  బడుగు బలహీన వర్గాలుకు,  బాధితులకు పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర న్యాయం లభిస్తుంది.ఇప్పటికే దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ పోలీసులు విచారణను వేగవంతం గా పూర్తి చేయడంతో పాటు  అతి తక్కువ సమయంలో  ఆన్లైన్ ద్వారా చార్జ్ షీట్ ను దాఖలు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు వేగంగా అందించడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన  సేవలు  అందించేందుకు  క్షేత్రస్థాయి అధికారికి  ఎంతగానో దోహదపడుతుంది.రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించేలా పోలీస్ శాఖ ఎఫ్ ఎస్ ఎల్ లతో సమన్వయం చేసుకుంటూ ,ముఖ్య మంత్రి గారికి ఆశయాలకు అనుగుణంగా  పోలీసులు శాఖ ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించేందుకు ఎల్లవేళలా  దృఢ సంకల్పమంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ & మాజీ డైరెక్టర్ అవినీతి నిరోదక శాఖ గుజరాత్, గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ లో  కీలక హోదాలో పనిచేసిన కేశవ కుమార్ IPS మాట్లాడుతూ తన సహచరుడు గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  ఇటువంటి శిక్షణ కార్య్రమాన్ని రాష్ట్ర స్థాయి లో మొదలుపెట్టడం చక్కిటి నిర్ణయం అని, టెక్నాలజీ వినియోగం లో అత్యంత మెరుగైన సేవలను ప్రజలకు అంధిస్తుందని ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాజంలో

పోలీసులు తమ దృక్కోణం లాఠి నుండి డాటా సేకరించడం  వైపు మారాలని ,అరెస్ట్ నుండి కన్వెక్షన్ వరకు మారాల్సిన అవసరం ఉంది అని తేల్చారు,పోలీసులు , ఫోరెన్సిక్ సమన్వయము ద్వారా మాత్రమే అద్భుత ఫలితాలను సాదించగలమని తెలిపారు.


ఈ సంద్భంగా Dr.J.M vyas వైస్ ఛాన్స్లర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ  & డైరెక్టర్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ గుజరాత్  మాట్లాడుతూ నేరస్తులు అత్యాధునిక  సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చట్టానికి దొరక్కుండా నేరాలు చేస్తున్నారు.ఇటువంటి నేరాలను అరికట్టా లంటే ఫోరెన్సిక్ విభాగాలైన DNA , cyber ,balastic, bio-chemical, లాంటి విషయాలలో వచ్చిన పలు కొత్త ఆవిష్కరణలను ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా  శిక్షల శాతాన్ని పెంచడం వలన వ్యవస్థల పట్ల ఆదరణ నమ్మకం పౌరులకు కలుగుతుంది  మరియు  గౌరవం పెరుతయి.


దేశంలోనే మొట్టమొదిసారిగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని శిక్షణ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం లో నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ  గుజరాత్ నుండి  పూర్తి సహకారాన్ని  అందించడంలో నైపుణ్యాభివృద్ధి  మెళుకువలలో ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు.


శిక్షణ పొందుతున్న 51 మంది లో  10 మంది డాక్టరేట్లు తో పాటు అత్యధికులు ఉన్నత స్థాయి విద్యాభ్యాసం  పొందిన వారు ఉన్నారు.


ఈ సందర్భగా పలువురు ఎంపికైనవారు  మాట్లాడుతూ ఈ కోవిడ్ సమయం లో  అతితక్కువ కాలంలో  ఉద్యోగం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అందుకు    ప్రభుత్వనికి ,పోలీస్  శాఖ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ..తమకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని తెలిపారు.

Comments