కోవిడ్ 19 నివారణకు బ్రిక్స్ తో ఒప్పందం కుదిరిందా?

 కోవిడ్ 19 నివారణకు బ్రిక్స్ తో ఒప్పందం కుదిరిందా? పార్లమెంట్ లో అడిగిన నెల్లూరు ఎంపీ ఆదాల కోవిడ్- 19 నివారణకు బ్రిక్స్ దేశాల సహకారంతో అవగాహన ఒప్పందం కుదిరిందా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. ఇందువల్ల లభించే  ప్రయోజనాలు ఏమిటని కూడా ప్రశ్నించారు. దీనికి ఆయుష్ మంత్రి సరబనంద సోనోవాల్ లిఖితపూర్వకంగా సమాధానం చెబుతూ ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి) సంప్రదాయ వైద్యానికి బ్రిక్స్ దేశాలతో సహకారానికి అవగాహన ఒప్పందం పై సంతకం చేసిందని తెలిపారు. ఇందుకుగాను సంప్రదాయక "బ్రిక్స్ ఫోరం"ను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని అన్నారు. సమన్వయం, నియంత్రణలను ప్రమాణిక రించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తద్వారా కోవిడ్ నివారించడానికి ప్రభుత్వం ఆయుష్ ద్వారా సంప్రదాయ వైద్య విధానాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించెందుకు ఆయుష్ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. చేతులు కడగడం, మాస్క్ ధరించడం కూడా ఇందులో భాగమని తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కోవిడ్-19 నివారణ, ఆరోగ్య చర్యల కోసం స్వీయ సంరక్షణ మార్గదర్శకాలను అభివృద్ధి చేసిందన్నారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని "ఆయుష్ ఫర్" మూడు నెలల ప్రచారాన్ని ప్రారంభించిందని అన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఒక వెబ్ నార్లో 50 వేల మందికి పైగా పాల్గొన్నారని తెలిపారు.కోవిడ్- 19 మహమ్మారిని ఎదుర్కోడానికి ఆయుష్ మౌలిక సదుపాయాలను భారీగా ఉపయోగించుకో నుందని పేర్కొన్నారు.

Comments