322 అక్రిడిటేషన్లు మంజూరు322 అక్రిడిటేషన్లు మంజూరుశ్రీకాకుళం, జూలై 24 (ప్రజా అమరావతి): శ్రీకాకుళం జిల్లాలో 322 మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లను మంజూరు జరిగింది. జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ అధ్యక్షతన శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.

జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ లకు 2021-22 సంవత్సరానికి అక్రిడిటేషన్ లను మంజూరు చేయుటకు సమాచార పౌర సంబంధాల శాఖ ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు ఆన్లైన్లో లో అన్ని డాక్యుమెంట్లతో సహా సమర్పించిన 322 దరఖాస్తులను కమిటీ పరిశీలించి మంజూరు చేసింది. అర్హత కలిగిన దరఖాస్తులకు మొదటి విడతగా  అక్రిడిటేషన్ లు మంజూరు చేయడం జరిగందని జిల్లా కలెక్టర్ అన్నారు.  వెబ్సైట్ ఓపెన్ లోనే ఉన్నందున అర్హులైన జర్నలిస్టులు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. తదుపరి సమావేశం ఆగస్టు 10వ తేదీన నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు మరియు కమిటీ కన్వీనర్ లోచర్ల రమేష్ ను ఆదేశించారు.

 జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్ దరఖాస్తును  తిరస్కరించ లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. 


ఈ సమావేశంలో  జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సభ్యులు డీఎంహెచ్ ఓ డా. కె. సి. చంద్ర నాయక్, కార్మిక శాఖ ఉప కమీషనర్  ఆర్. రాధా కుమారి, హౌసింగ్ అసిస్టెంట్ మేనేజర్ రాధా కృష్ణ, ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి. వర లక్ష్మి,, సమాచార శాఖ  డిఈ సి.హెచ్. రామ్ ప్రసాద్, జిఎస్టి ప్రతినిధి కే. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments