విద్యావ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలికిన జగనన్న విద్యా దీవెన

 ‘జగనన్న విద్యా దీవెన’ తో విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు


ఫీజురీయింబర్స్ మెంట్ కోసం విద్యార్ధులు ఎదురుచూడకూడదు, తల్లిదండ్రులు అప్పుల పాలు    

    కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం...

తొలి విడతగా ఏప్రిల్ లో 10,88,439 మంది విద్యార్ధులకి  రూ.671.45 కోట్ల విడుదల

రెండో విడత జూలై లో దాదాపు 10.97 లక్షల విద్యార్ధులకి రూ 693.81 కోట్ల విడుదల

ప్రతి మూడు నెలలకు ఫీజురీయింబర్స్ మెంట్ నేరుగా తల్లుల ఖాతాల్లో జమ

కాలేజీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

విద్యావ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలికిన జగనన్న విద్యా దీవెన

"నవరత్నాలు" కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం (ఫీజు రీయింబర్స్ మెంట్‌)  ద్వారా  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తొలి విడతగా 10,88,439 మంది విద్యార్ధులకి  రూ.671.45 కోట్లు నేరుగా విద్యార్ధుల తల్లుల  ఖాతాల్లో వేయగా, రెండో విడతగా జూలై నెలలో దాదాపు 10.97 లక్షల విద్యార్ధులకి  రూ 693.81 కోట్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


   నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద, పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ప్రపంచ చరిత్రలో లిఖించే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా  అర్హత ఉన్న ప్రతి విద్యార్ధికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్  చెల్లించి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.  


  ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము కోసం విద్యార్ధులు గతంలో లాగా ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి లేకుండా కరోనా నేపధ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా చెప్పిన సమయానికే జగనన్న విద్యా దీవెన పధకం క్రింద రెండవ విడత ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.


   ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఐటీఐ, బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఫార్మసీ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని  ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటికే 2020-21 విద్యా సంవత్సరం మొదటి విడతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 19 న బటన్ నొక్కి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రెండో విడతను జూలై 29న విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో దాదాపు రూ. 693.91 కోట్లను జమ చేసేందుకు కార్యాచరణను చేపట్టడం జరిగింది. ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు,వారి తల్లిదండ్రులకు ఇదో గొప్ప మేలు మలుపుగా నిలుస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

       గత ప్రభుత్వంలో జరిగిన విథంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి పలికి, గత ప్రభుత్వం 2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన బకాయిలు రూ.1,774.60 కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీర్చడంతో పాటు మొత్తం రూ.4,207.85 కోట్లను విద్యార్దులకు విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదటి విడతగా 10,88,439 మంది విద్యార్ధులకు రూ.671.45 కోట్లను చెల్లించడం జరిగింది. రెండో విడత ఫీజు రీయింబర్స్ మెంట్ ను జూలై నెలలో దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు దాదాపు రూ. 693.81 కోట్లను చెల్లిస్తోంది.


    అదేవిధంగా 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక వేళ తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే, ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా కాలేజీల నుంచి తిరిగి తీసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. 2018–19, 2019–20 లలో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఫీజు కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా తిరిగి తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.


     2020–21 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్ మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కాలేజీలు ఎక్కడా ఫీజుల పేరుతో అదనంగా వసూలు చేయకూడదు.

గడిచిన సంవత్సరాలలో అడ్మిషన్ తీసుకొని పై తరగతులు చదువుతున్న విద్యార్ధులకు కూడా పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం వర్తింప జేసింది. 


     2019-20 సంవత్సరంలో విద్యార్ధినీ, విద్యార్ధులు ఏదైనా కాలేజీకి ఎంతైనా పీజు లేదా స్పెషల్ పీజు చెల్లించి ఉంటే, ఆ మొత్తాన్ని కాలేజీలు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించింది కాబట్టి, తల్లిదండ్రులు కట్టిన వ్యత్యాసం మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలు వారికి తిరిగి చెల్లించాలి. అలా కట్టిన మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలు చెల్లించనట్లైతే, ఆ డబ్బు వాపసు ఇవ్వాల్సిందిగా ముందుగా యాజమాన్యాలను అడిగి వారు ఇవ్వని పక్షంలో 1902 నంబర్ కు ఫోన్ చేసి ప్రభుత్వానికి తెలియాలి. వెంటనే ఆ మొత్తం సంబంధిత విద్యార్ధుల తల్లులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. Comments