చిట్టీలు వడ్డీ వ్యాపారంతో మోసగించిన ఘరానా మోసగాడు అరెస్ట్.

 *ప్రకాశంజిల్లా .              చిట్టీలు వడ్డీ  వ్యాపారంతో మోసగించిన ఘరానా మోసగాడు అరెస్ట్*

ప్రకాశం జిల్లా (ప్రజా అమరావతి); గిద్దలూరులో చిట్టీలు వడ్డీ వ్యాపారం పేరుతో మోసగించిన మాజీ ఆర్మీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పి కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు బేస్తవారిపేట మండలం. చిన్న ఒబినేని పల్లి గ్రామానికి చెందిన కొంగల వీటి రమణారెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి  ఇతను గిద్దలూరులో స్థిరపడి పలువురితో పరిచయాలు పెంచుకొని చిట్టీలు మరియు వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు నాలుగు కోట్ల వరకు డబ్బులు వసూలు లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని,


అలానే రమణారెడ్డి ఉన్న పరిచయాలతో లక్ష రూపాయల చిట్టీల నుండి 15 లక్షల చిట్టీలు వేసి పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టాడు అని, అలానే పలువురి వద్ద వసూలు చేసిన డబ్బులతో జల్సాలు చేసి నగదు అంత ఖర్చు పెట్టాడని మోసపోయిన వారిలో చాలా మంది ఆర్మీ ఉద్యోగులు కూడా ఉన్నారని.


చిట్టీలు కట్టినవారు రమణారెడ్డి ని డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ ఉండడంతో ఈనెల 6వ తేదీ న ఇంటి నుంచి పరారు అయ్యాడు అని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పరారైన రమణారెడ్డి ని ఈనెల 27 తేదీన సాయంత్రం 4:30 నిమిషాల సమయంలో గిద్దలూరు మండలం కృష్టం శెట్టి పల్లి గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలానే నిందితుడి వద్ద నుంచి కొన్ని ఆస్తుల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని నిందితుడిని ఈరోజు రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు...!!