పేదవర్గాల గుండెల్లో నిలిచిపోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.



పేదవర్గాల గుండెల్లో నిలిచిపోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.


పేదవర్గాల గుండెల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన వివిధ నామినేటెడ్ పదవులను పరిశీలిస్తే మరోమారు ఈ విషయం రుజువయిందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో శనివారం ప్రకటించిన 137 రాష్ట్ర, జిల్లా స్థాయి చైర్మన్ లను చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లపై అయనకున్న ప్రేమ స్పష్టమైందన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే,  డా.బిఆర్.అంబేద్కర్ లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాల అభివృద్ధి కి పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందన్నారు. ఒక  ఎస్సీమహిళను హోంమంత్రిని చేయడం జరిగిందని, ఎస్సీ ల్లో నుంచి తనకు ప్రాధాన్యత ఇచ్చి విద్యాశాఖను ఇచ్చారన్నారు. మాల, మాదిగల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేయటంతో దళితులు ఆయనకు కృతఙ్ఞతలు తెలుతున్నరన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 137 రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కార్పొరేషన్లలో 58 నుంచి 60 శాతం వరకు పదవులను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. అందులో మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించటం గర్వించదగ్గ విషయమని మంత్రి సురేష్ పేర్కొన్నారు.