గూగుల్, ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో అడ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ పై శిక్షణ


                * గూగుల్, ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో అడ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ పై శిక్షణ

* ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకులకు కొట్లిన్ సాఫ్ట్ వేర్ పై ట్రైనింగ్

* ఆన్ లైన్ ద్వారా ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి, శిక్షణాశాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి


అమరావతి (ప్రజా అమరావతి):

ప్రపంచ టెక్నాలజీ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆండ్రాయిడ్ టెక్నాలజీని గూగుల్ సహకారంతో రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ యూజింగ్ విత్ కొట్లిన్ ప్రోగ్రామ్ పై ఇంజనీరింగ్ అధ్యాపకులకు అవగాహనా కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా చల్లా మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఓరియెంటేషన్ కార్యక్రమానికి వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 145 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్, ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్ధులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాబోయే రోజుల్లో గూగుల్ సహకారంతో ఎపిఎస్‌ఎస్‌డిసి మరిన్ని కోర్సుల్లో శిక్షణ ఇవ్వబోతోందని.. అధ్యాపకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చల్లా మధుసూదన్ రెడ్డి చెప్పారు. 

  అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటి రెడ్డి మాట్లాడుతూ..  గూగుల్ కోర్సుల ద్వారా ఆండ్రాయిడ్ అప్లికేషన్లను తయారు చేసే వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. గుగూల్ సహకారంతో అధ్యాపకులు, విద్యార్థులకు కొట్లిన్ సాఫ్ట్ వేర్ పై శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. 

ఎపిఎస్‌ఎస్‌డిసి చీఫ్ జనరల్ మేనేజర్ టెక్నికల్ డాక్టర్ రవి గుజ్జుల మాట్లాడుతూ గూగుల్ సహకారంతో ఎపిఎస్‌ఎస్‌డిసి ఇప్పటికే అనేక శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అధ్యాపకులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు కూడా లేటెస్ట్ టెక్నాలజీలను నేర్పిస్తారని.. తద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇవే కాకుండా ఎపిఎస్‌ఎస్‌డిసి అనేక మల్టీనేషనల్ కంపెనీలతో కలిసి పనిచేస్తోందని ఆయన అన్నారు. 

అనంతరం గూగుల్ డెవలపర్ రిలేషన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ కార్తిక్ పద్మనాభన్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ టెక్నాలజీదే ప్రధాన వాటా అన్నారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో కొట్లిన్ సాఫ్ట్ వేర్ ను నేర్చుకోవాల్సిన ఆవశ్యతకను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 40 యూనివర్సిటీలు, ట్రైనింగ్ భాగస్వాములతో కలిపి మొత్తం 500 కాలేజీల్లో 1400 మంది అధ్యాపకులకు ఈ టెక్నాలజీలో శిక్షణ ప్రారంభించామని కార్తిక్ పద్మనాభన్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటి రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ టెక్నికల్ డాక్టర్ గుజ్జుల రవి, గూగుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేనేజర్ లలిత్ సింగ్, గూగుల్ కమ్యూనిటీ మేనేజర్ హర్ష్ దత్తని, కొట్లిన్ మార్కెటింగ్ మేనేజర్ క్సేనియా ష్నీవేస్, గూగుల్ డెవలపర్ ఎక్స్ పర్ట్ నిహారికా అరోరా, గూగుల్ డెవలపర్ ఎక్స్ పర్ట్ ఫర్ ఆండ్రాయిడ్, హిమాన్షూ సింగ్ ఇతర ఎపిఎస్‌ఎస్‌డిసి సిబ్బంది పాల్గొన్నారు.