శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి): 

ఈరోజు అనగా ది.19-07-2021, సోమవారము రోజున దేవస్థానంనకు కర్ణాటక లోని హంపి పీఠాధిపతులు శ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ గారు శ్రీ అమ్మవారి దేవస్థానం నకు విచ్చేయగా, గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి

డా.జి.వాని మోహన్, IAS గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహనాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు ఆలయమర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు స్వామి వారికి

వేదస్వస్తి పలికారు.  మంత్రివర్యులు  శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు,  ప్రిన్సిపల్ సీక్రెటరీ గారు మరియు ఆలయ  కార్యనిర్వహణాధికారి గారు, పాలకమండలిసభ్యులు శ్రీమతి ఎన్. సుజాత గారు  మరియు వైదిక కమిటీ సభ్యులు, ప్రధానార్చకులు స్వామీజీ వారికి పూలు పండ్లు మరియు శ్రీ అమ్మవారి ప్రసాదములను సమర్పించగా , స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణం చేశారు. అనంతరం మంత్రివర్యులు  శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు,  ప్రిన్సిపల్ సీక్రెటరీ గారు మరియు ఆలయ  కార్యనిర్వహణాధికారి గారు, పాలకమండలిసభ్యులు శ్రీమతి ఎన్. సుజాత గారు స్వామీజీ వారికి శ్రీ మల్లేశ్వరస్వామి వారిని దర్శనం కల్పించి, మల్లేశ్వరస్వామి వారికి పూజలు నిర్వహించారు.