మెరైన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి

 కృష్ణాజిల్లా మచిలీపట్నం (ప్రజా అమరావతి);


*మెరైన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి


.*


_సముద్రతీర ప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీ గారు వారితో సమావేశం నిర్వహించి, మెరైన్ పోలీస్ స్టేషన్ ల నందు పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఎంత మంది సిబ్బంది ఉన్నది, వారి విధి నిర్వహణ పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో కమ్యూనిటీ పరంగా ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది లేనిది, అడిగి తెలుసుకుని, ప్రస్తుత పరిస్థితి అంత ప్రశాంతంగా ఉన్నదని తెలుసుకుని ఆనందించారు. "సాగర్ కా వాచ్" కార్యక్రమం తడువుగా నిర్వహిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకు రావచ్చు అని, సిబ్బంది సంక్షేమం లో రాజీ పడవద్దని తెలిపారు._


_సముద్ర తీర ప్రాంత ప్రజల అందరితో మర్యాదపూర్వకంగా మెలగుతూ, అనునిత్యం ఆ ప్రాంతాలలో సిబ్బంది నిరంతర తనిఖీలు చేస్తూ, నిఘా ఏర్పాటు చేయాలని ,తరుచు ఆ ప్రాంతాలను విజిట్ చేస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలియజేశారు. ఏవైనా సమస్యలు మీ దృష్టికి వస్తే వెంటనే తెలియ చేయాలని తెలిపారు_


_విధులు నిర్వహిస్తున్న  అధికారులు,సిబ్బంది పోలీస్ శాఖలో కి ఎప్పుడు ప్రవేశించింది ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తుంది కుటుంబం గురించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు_


_ఈ సమావేశంలో గిలకలదిండి సీఐ సతీష్ కుమార్ గారు, పాలకాయతిప్ప సీఐ పవన్ కిషోర్ గారు, వర్ల గొంది తిప్ప సీఐ మోహన్ కుమార్ గారు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు._