గుంటూరులో యువతి హత్యా ఘటనపై సీఎం ఆరాగుంటూరులో యువతి హత్యా ఘటనపై సీఎం ఆరా

కఠిన చర్యలకు ఆదేశం

బాధిత కుటుంబానికి రూ.10లక్షల ప్రకటన


అమరావతి (ప్రజా అమరావతి);

గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని., పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image