శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):  ఈరోజు అనగా ది.24-08-2021న సత్యనారాయణపురం, విజయవాడకు చెందిన దాత శ్రీ వంతరం రాజేష్ మరియు సరిత దంపతులు వారి తల్లిదండ్రులు వి.రామచంద్ర రావు మరియు రాజ్యలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం శ్రీ అమ్మవారి ఆలయము నకు 5 లీటర్ల కెపాసిటీ  గల oxygen కాంసెంట్రేటర్ - 1 నెం.  శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము, వేదపండితులు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.