నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కొడాలి నాని*

 *- నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కొడాలి నాని*  విజయవాడ, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కుమారుని వివాహ రిసెప్షన్ సందర్భంగా నూతన వధూవరులను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆశీర్వదించారు. గురువారం రాత్రి విజయవాడలోని ఏ వన్ కళ్యాణ మండపంలో వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తదితరులతో కలసి మంత్రి కొడాలి నాని నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.

Comments