బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులకు ఇంటి పట్టాను హోంమంత్రి మేకతోటి సుచరిత గారు అందించారు.

 గుంటూరు (ప్రజా అమరావతి):


బిటెక్ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులకు ఇంటి పట్టాను హోంమంత్రి మేకతోటి సుచరిత గారు అందించారు. 


పరమాయకుంట లోని రమ్య ఇంటికి స్వయంగా వెళ్లి పట్టా ఇవ్వడంతో పాటు.. కుటుంబసభ్యులను పరామర్శించారు. 

ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరి, కలెక్టర్ వివేక్ యాదవ్, జిడిసీసీ ఛైర్మన్ లాల్ పురం రాము, ఇతర అధికారులు, నాయకులు రమ్య కుటుంబ సభ్యులను పరర్శించిన వారిలో ఉన్నారు.

రమ్య కుటుంబసభ్యులకు హోంమంత్రి మేకతోటి సుచరిత  ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ప్రభుత్వం తరపున ప్రకటించిన ఇళ్ల పట్టాను రమ్య తల్లిదండ్రులకు హోంమంత్రి అందించారు. భవిష్యత్తు లో రమ్య కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆకతాయిలు నుండి వేధింపులు ఉంటే తల్లిదండ్రులకు, లేదంటే పోలీసులకు చెప్పాలని విద్యార్థినులకు హోంమంత్రి సూచించారు.సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకునే ఆపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న వారిపై దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని హోంమంత్రి సూచించారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దిశ SOS యాప్ ద్వారా నేరుగా మొబైల్ నుండే కంప్లైంట్ ఇవ్వొచ్చు అన్నారు.ఇప్పటికే దాదాపు 40 లక్షలకు పైగా దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, 3 లక్షలకు పైగా కాల్స్ చేసారని హోంమంత్రి తెలిపారు.మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించడం జరిగిందన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  చిత్తశుద్ధితో ఉన్నారని హోంమంత్రి తెలిపారు.

రాష్ట్రంలో ఏక్కడ మహిళలపై అఘాయిత్యం జరిగినా సీఎం స్వయంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.అంతేకాదు బాధిత కుటుంబాలకు సీఎం  మానవతా దృక్పథంతో సత్వర ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు.

సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని హోంమంత్రి సుచరిత గారు సూచించారు.Comments