అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు

 


- అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు 


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 24 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామానికి చెందిన మల్లంపల్లి గంగమ్మ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్తకు ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తోందన్నారు. ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో మంచం పైనే గడుపుతున్నారని, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ పెన్షన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలని గంగమ్మ కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఈ విషయాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 1 వ తేదీ తెల్లవారుజాము నుండే పెన్షనర్లకు ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాలను అందజేస్తున్నామన్నారు. దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 60.50 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉ న్నారని చెప్పారు. వీరికి ప్రతి నెలా రూ.1,455.87 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ల జారీలో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. ఎక్కడైనా అనరులకు కూడా పెన్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చిన వెంటనే పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. సంబంధిత అధికారుల నుండి వచ్చే నివేదికలను పరిశీలించి అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు.